English   

అప్పుడే మొగుడికి కండిషన్స్ పెట్టిన దీపిక !

Deepika Padukone turns strict wife for Ranveer Singh bans him from doing THESE 3 things
2019-01-17 21:58:38

ఆరేళ్ల పాటు లవ్ చేసుకుని ఒకరినొకరు ఎంతో అర్ధం చేసుకున్న అనంతరం, ఈ మధ్యనే ఇటలీలో రణవీర్‌ సింగ్, దీపికా పదుకొనే వివాహం బంధంతో ఒకటయిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ళు ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు ఇక వీరి మధ్య అరమరికలు ఉండవని అనుకుంటారు జనం, నిజంగానే అలాంటివి ఏమీ ఉండవట కానీ పెళ్లై పట్టుమని పది నెలలు కూడా కాకుండానే మొగుడికి కండీషన్లు పెడుతుందట దీపిక. ఎన్ని కండీషన్లు పెట్టిందో ఏమో  తెలీదు కానీ ఒక మూడు మాత్రం పక్కా ఫాలో అవ్వాలట. ఈ విషయాన్నీ రణవీర్ తాజా ఇంటర్వ్యూలో రణవీర్ వెల్లడించాడు. అందులో మొదటి కండీషన్ ఎప్పుడు బయటకు వెళ్లినా సాయంత్రం కాగానే ఇంటికి చేరుకోవాలట, భర్త మీద ప్రేమ ఉండొచ్చు కానీ సినిమా యాక్టర్ జీవితం అంటే ఏమిటో తెలిసిన దీపిక ఈ కండీషన్ పెట్టింది ఏంటో మరి. ఇక రెండో కండీషన్ ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా ఏదో ఒకటి తిని వెళ్ళాలి కాళీ కడుపుతో అస్సలు వెళ్ళకూడదు. ఈ కండీషన్ కాస్త లాజిక్ గానే ఉంది. బయట ఏమైనా తిని ఆరోగ్యం పాడయితే బాధ పడాల్సింది తానే కాబట్టి ఆ కండీషన్ పెట్టి ఉండొచ్చు. ఇక మూడవ కండీషన్ ఏంటంటే తను ఎప్పుడూ ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యాలట, కాల్ మిస్ చేయడం అనేది ఇక ఉండకూడదని చెప్పుకొచ్చాడు. ఇది కూడా కామెడీగానే ఉంది, ఎందుకంటే యాక్టర్ లైఫ్ తెలిసి తెలిసి ఇలాంటి కండీషన్ పెట్టడం అంటే అలానే ఉంది మరి. నిజానికి ఈ మూడు కండీషన్స్ ఇంతేనా అనేలా గా ఉన్నా వీటిలో పరమార్ధం చాలా ఉంది. మొదటి కండీషన్ ల వల్ల లేట్ నైట్ పార్టీలకు వెళ్లే అవకాశం ఉండదు, సో అఫైర్లు, గాసిప్ లు వచ్చే బెడద తప్పుతుంది. రెండో కండీషన్ కు బయట తినడం తాగడం లాంటివి చేయలేం. ఎందుకంటే అప్పటికే కడుపు నిండా తిని వస్తాం కాబట్టి. ఇక మూడో కండీషన్ గురించి చెప్పాలంటే ఎటువంటి పరిస్థితుల్లో అఫైర్ల జోలికి వెళ్ళడం అనేది ఉండదన్న మాట

More Related Stories