English   

మహర్షి లేట్ గా వస్తాడట !

Release date of Maharshi starring Mahesh Babu and Pooja Hegde gets pushed again
2019-01-17 15:05:51

ప్రిన్స్ మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినినా 'మహర్షి'. ఇది మహేష్ కెరీర్‌ లో మెయిలు రాయి లాంటి 25వ చిత్రం కావడంతో ఈ సినిమా మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో మహేష్ శ్రీమంతుడిగా కనిపించనుండగా ఆయన స్నేహితుడిగా అల్లరి నరేశ్ నటించనున్నారు. అయితే పేదవాడైన స్నేహితుడి కోసం తన వ్యాపారాలను పక్కన పడేసి, విదేశాల నుంచి ఇండియాలోని ఓ మారుమూల పల్లెటూరికి వచ్చేస్తాడట మహేష్. పేదరికంలో మగ్గుతున్న తన స్నేహితుడినే కాక ఆ ఊరునే బాగు చేసి వెళతాడు అని, అదే స్టోరీ లైన్ అని అంటున్నారు. ఇక మరో పక్క ఈ సినిమా విడుదల తేదీని ఇదివరకే యూనిట్ ప్రకటించింది. అయితే సినిమా షూట్ ఇంకా బాకీ ఉండడంతో మూవీ విడుదల తేదీని వాయిదా వేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ 5న విడుదలవ్వాల్సిన సినిమాని ఏప్రిల్ చివరి వారానికి వాయిదా వేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం మీద హీరో వైపు నుండి కానీ, ప్రొడ్యూసర్ వైపు నుండి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. చూడాలి మరి ఏమవుతుందో !

More Related Stories