English   

మరో సినిమా ఓకే చేసిన సిమ్రన్ ! 

Simran
2019-01-18 04:59:26

‘రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్‌’ మాధవన్‌ లీడ్ రోల్ లో నటిస్తూ దర్శకుడిగానూ బాధ్యతలు చేపట్టారు.  ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్‌ జీవితం ఆధారంగా రూపొందుతోంది ఈ సినిమా. నంబీ నారాయణ్‌ గురించి చెప్పాలంటే విదేశీ గూఢచారి అంటూ ఆయనపై 1994లో కేసులు నమోదయ్యాయి. చాలా ఏళ్లు పోరాడిన తర్వాత ఆయన ‘నిర్దోషి’ అనే తీర్పు గతేడాది వచ్చింది. ఆయన జీవితంలో జరిగిన మలుపులు ఆధారంగా అనంత మహదేవన్‌ తో కలసి ఈ సినిమాని డైరెక్ట్‌ చేస్తున్నారు మాధవన్‌. అయితే ఈ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. తమిళ తెలుగు బాషలలో స్టార్ హీరోలందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సిమ్రన్. పెళ్లి తర్వాత సినిమాల్లో కనిపించడం మానేసింది. ఇక సుదీర్ఘ విరామం తర్వాత ఈ ముద్దుగుమ్మ ఇటీవలే రజనీకాంత్ పేటా సినిమా నటించి అందరిని అలరించింది. ఆమె 'రాకెట్రీ..ది నంబీ ఎఫెక్ట్' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించేందుకు ఒకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో అమృత సినిమాలో కలిసి నటించి అలరించిన మాధవన్, సిమ్రన్ మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకులని అలరించనున్నారు.

More Related Stories