English   

సూర్య కొడుకు తెరంగ్రేటం !

surya
2019-01-18 06:03:16

గత ఏడాది గ్యాంగ్ తో హిట్ మిస్సయిన సూర్య, తాజాగా ఒక మల్టీ స్టారర్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే. దీనికి కాప్పన్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మళయాళ మోహన్ లాల్ తో పాటు హీరో ఆర్య నటిస్తున్న ఈ సినిమాకి కెవి ఆనంద్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సూర్యతో ఈయన గతంలో చేసిన వీరుడొక్కడే - బ్రదర్స్ అంతటి బంపర్ హిట్ లు కాకపోయినా ఫర్వాలేదనిపించాయి. ఆ విషయం పక్కన పెడుతే ఇప్పుడు సూర్య తన కొడుకుని తెరగ్రేతం చేయిస్తున్నాడన్న వార్త ప్రచారం జరుగుతోంది. చాలా సంవత్సరాల క్రితం హీరోయిన్ జ్యోతికను వివాహం చేసుకున్న సూర్యకి ఇద్దరు సంతానం. అందులో తన 8 సంవత్సరాల కొడుకుతో తెరంగేట్రం చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో మేము అనే చిన్న పిల్లల సినిమాను నిర్మించిన సూర్య తాజాగా మరోసారి నిర్మాతగా చిన్న పిల్లలకు సంబంధించిన సినిమాను నిర్మించబోతున్నాడని అంటున్నారు. 'మేము' చిత్రంలో సూర్య కీలక పాత్రలో కనిపించాడు. ఆ సినిమా తెలుగులో పెద్దగా ఆడకపోయినా తమిళంలో మాత్రం బానే ఆడింది. ఇప్పుడు తమిళంలో మరో సారి చిన్న పిల్లల నేపథ్యంలో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నాడని సమాచారం. ఆ సినిమా కోసం తన కొడుకు దేవ్ ను కీలక పాత్రలో ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.  సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సూర్య సన్నాహాలు చేస్తున్నాడట. బుడ్డోడు ఎనిమిదేళ్ళకే లీడ్ రోల్ అంటే మామూలు విషయమా మరి ?

More Related Stories