English   

నాగార్జున తాత..చైతన్య  మనవడు!

Nag
2019-01-18 13:52:18

నాగార్జున కథానాయకుడిగా ఆ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒకవైపు అమాయకుడైన రాము పాత్రలో, మరొకవైపు రసిక రాజాగా కనిపించే బంగార్రాజుగా రెండు విభిన్నమైన పాత్రల్లో నటించిన నాగార్జున ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. బంగార్రాజు పాత్రలో అలరించిన నాగ్ మళ్ళీ అదే పాత్రలో కనిపించనున్నాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'సోగ్గాడే చిన్ని నాయనా' వచ్చిన సినిమా ప్రీక్వెల్ గా పూర్తిగా బంగార్రాజు పాత్ర చుట్టూ తిరిగే 'బంగార్రాజు' సినిమా తెరకేక్కిస్తున్నాడు. మొదటి సినిమా మీద వచ్చిన క్రేజ్ ని బట్టి ఈ రానున్న సినిమా పై ఫ్యాన్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం సంక్రాంతి సందర్భంగా ఒక శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 'బంగార్రాజు'గా మనముందుకు వస్తారని ప్రకటించారు. అయితే ఈ సినిమాలో నాగార్జునతోపాటు నాగ చైతన్య కూడా నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. తాత పాత్రలో నాగార్జున ఆయనకు మనవడి పాత్రలో చైతూ కనిపించనున్నారని సమాచారం. ఈ రెండు పాత్రల చుట్టూనే కథ తిరుగుతుందని అంటున్నారు. నిజానికి మనం సినిమాలో నాగార్జున తండ్రిగా కనిపించగా ఈ సినిమాలో చైతన్యకి తాతగా నటిస్తున్నాడు నాగార్జున. 

More Related Stories