English   

రాజస్థాన్ వెళ్తున్న గోపీ అండ్ టీం !

Gopichand
2019-01-18 18:57:14

తన కెరీర్ మొదటిలో యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేసిన గోపీచంద్, ఆ తరువాత యాక్షన్ కి ఎమోషన్ ను జోడించి ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరయ్యాడు. అయితే తర్వాతి కాలంలో అవేవీ కలిసి రాకపోవడంతో చక్కగా కామెడీ సబ్జెక్ట్స్ కూడా చేశాడు. ఇన్ని కష్టాలు పడుతున్నా ఆయన్ను హిట్ మాత్రం పలకరించలేదు. ఇలా కాదని బీసీ సెంటర్ల కోసం మాస్ ఫైట్లు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం క్లాస్ సీన్లు అన్నీ ఉండేలా ప్లాన్ చేస్తున్నా ఆయనకు సక్సెస్ అనేది రావట్లేదు. 

ఈ నేపధ్యంలో పంతం సినిమా వచ్చి ఆరు నెలలు కావస్తున్నా చాలా రోజులు గ్యాప్ తీసుకుని గోపీచంద్ తన తదుపరి సినిమా ఓకే చేశాడు. మంచి కధ కోసం వెతుకుతూ ఉండడమే ఈ ఆలస్యానికి కారణం అని అంటున్నారు. తాజాగా ఆయన తమిళ దర్శకుడు 'తిరు'తో కలిసి ఒక సినిమా చేయడానికి పూనుకున్నాడు. కెరీర్ మొదటి నుండి విశాల్ తో మూడు సినిమాలు తీసిన తిరు సరయిన హిట్ అయితే అందుకోలేదు. చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న గోపీతో జత కట్టి ఇద్దరూ హిట్ కొట్టాలని చూస్తున్నారు. అయితే ఇంకా టైటిల్ ను ఖరారు చేయని ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను రాజస్థాన్ లో ప్లాన్ చేశారట.

 ఈ నెల 21వ తేదీ నుంచి 45 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరగనుందని సమాచారం. సినిమాలో కీలకమయిన యాక్షన్ సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తారని సమాచారం. అయితే ఈ సినిమాకి ఇంకా హీరోయిన్స్ ని ఎంపిక చేయలేదు, త్వరలో కధకు అవసరమయిన ఇద్దరు హీరోయిన్స్ ని ఎంపిక చేస్తారని అంటున్నారు. 

More Related Stories