English   

సాహో నుండి ఇంటరెస్టింగ్ అప్డేట్ !

Prabhas-Saaho
2019-01-19 11:23:51

బాహుబలి సిరీస్ ఏమంటూ ఒప్పుకున్నాడో తెలీదు కానీ ప్రభాస్ కు అప్పటి నుండి వెయిటింగ్ తప్పట్లేదు. మినిమం ఒక్కో సినిమాకి రెండేళ్ళు పట్టేస్తోంది. ఇప్పుడు ఆయన హీరోగా తేరకేక్కుతున్న చిత్రం సాహో. ఆగస్ట్ 15 రిలీజ్ అని ప్రకటించేశారు కాబట్టి ఎలా అయినా ఆ సమయానికి రిలీజ్ చేయడనికి ఇప్పుడు జెట్ వేగంతో షూట్ కానిస్తున్నారు. తాజాగా సాహోకి సంబంధించిన ఒక అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇస్తోంది. అదేంటంటే ఇప్పటి వరకూ ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ని హాలీవుడ రేంజ్ లో తెరకెక్కించిన టీం ఇప్పుడు ఒక స్పెషల్ సంగ్ కోసం భారీగా ఖర్చుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం లారెంట్ నికోలాస్, లారీ నికోలాస్ అనే అంతర్జాతీయ గుర్తింపు కలిగిన కవల డ్యాన్సర్లను సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదొక్కటే కాక మరో ప్రచారం కూడా సాగుతోంది అదేంటంటే ప్రముఖ పాప్ సింగర్ బేయాన్స్ ఈ పాటలో ప్రభాస్ తో కలిసి నర్తించనుందని అంటున్నారు. ఫేమస్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ నేతృత్వంలో త్వరలోనే దీన్ని షూట్ చేయబోతున్నట్టు చెబుతున్నారు. వందలాది బ్రెజిల్ డాన్సర్లు కూడా ఈ సాంగ్ లో డ్యాన్స్ చేస్తారట. ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఇలా సింగర్‌తో డాన్స్ చేయించడం మొదటిసారి. అంటే ఒకరకంగా తెలుగు సినిమా రేంజ్ ని బాహుబలితో రాజమౌళి పెంచగా ఈసారి ప్రభస్ ని పట్టుకుని సుజీత్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడని తెలుస్తోంది.

More Related Stories