English   

యాత్ర సినిమాలో జగన్...లేటెస్ట్ అప్డేట్ !

Jagan
2019-01-19 12:11:56

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికలకు ముందు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆనందో బ్రహ్మ ఫేం మహి వీ రాఘవ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వైఎస్ గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా, వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. తాజాగా ఈ వీరిద్దరి ఫస్ట్ లుక్స్, ట్రైలర్ టీజర్ లతో హీట్ పెంచేసింది సినిమా యూనిట్. సినిమాకు సంబంధించి తాజా అప్ డేట్ జగన్ ఫాన్స్ కి మాత్రం పండగే. ఎందుకంటే  అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో వైఎస్ జగన్ నిజ జీవిత పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఆయనని కొంచెం సేపు సినిమాలో చూపించనున్నారు. అంటే ఈ సినిమాలో ఆయన నటించలేదు సినిమా పరంగా అవసరమైన కొన్ని సీన్స్ కోసం గతంలో ఉన్న వీడియో ఫుటేజ్ ను వాడబోతున్నారు. సినిమా చివరి పావుగంట పూర్తిగా వైఎస్ మరణంకు సంబంధించిన రియల్ ఫుటేజ్ వాడనున్నారు. వైఎస్ మరణం తర్వాత తీసిన ఫుటేజ్, అప్పుడు అభిమానుల రోదనలు ఆయన అంతిమ యాత్ర ఇలా ఎడిట్ చేసి తెరపై చూపించబోతున్నారని తెలుస్తోంది. అప్పుడు వైఎస్ అంతిమ సంస్కారాల సమయంలో జగన్ కనిపిస్తారట. ఈ సినిమాలో అప్పటి కాంగ్రెస్ నేత , ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాత్రలో నటి అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. మాహానాయకుడు సినిమా విడుదల వాయిదా పడడంతో ఈ సినిమాకి పోటీ ఉండక పోవచ్చు,. ఎమోషన్స్ ని బాగా తెరకెక్కించడంతో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.

More Related Stories