English   

పశువుల మాఫియా కథకు మహేష్ బాబు ఓకే చెప్తాడా...

Mahesh-Babu
2019-01-19 05:20:53

మహేష్ బాబు ఏంటి.. పశువుల మాఫియా ఏంటి అనుకుంటున్నారా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు కోసం ఓ యువ రచయిత్రి ఓ కథను సిద్ధం చేసింది. ఆమె పేరు సుచిత్ర రావు. ఈ మధ్యే కే జి ఎఫ్ సినిమాకు కథ అందించింది ఈమె. ఇక ఇప్పుడు ఇది హైవే మాఫియా అనే పేరుతో ఒక కథ సిద్ధం చేసింది. అందులో మహేష్ బాబు.. విజయ్.. యశ్ నటిస్తే బాగుంటుందని కోరుకుంటుంది సుచిత్ర రావు. పశువుల మాఫియా.. వాటిని ఎలా తరలిస్తున్నారు అనే కథతో ది హైవే మాఫియా కథ సిద్ధంగా ఉంది. ఇందులో మహేష్ బాబు తెలుగులో.. విజయ్ తమిళ్.. కన్నడలో యశ్ నటిస్తే బాగుంటుందని సుచిత్ర అభిప్రాయం. ఇది జరుగుతుందా జరగదా అనేది పక్కన పెడితే ఒకవేళ ముగ్గురు గాని ఈ సినిమాలో నటిస్తే సంచలనం అవుతుంది. సుచిత్ర రావు కోరిక తీరడం అంత ఈజీ కాదు. మహేష్ బాబు ఇలాంటి కథలకు అసలు ఓకే చెప్పడం అభిమానుల గట్టి నమ్మకం. ఆయన ఇలాంటి టైమ్ లో పెద్దగా రిస్క్ తీసుకోడు. విజయ్ కూడా ప్రస్తుతం పొలిటికల్ సినిమాల బిజీలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో పశువుల మాఫియా కథలు అంటే అస్సలు ఒప్పుకోడు. ఏదేమైనా ఇలాంటి కథ ఒకటి చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన అయితే సుచిత్ర రావుకు ఉంది. మరి నెరవేరుతుందో లేదో చూడాలి.

More Related Stories