English   

హరీష్ శంకర్ కి షాకిచ్చిన వరుణ్ !

Varun-Tej
2019-01-19 05:29:52

అంతరిక్షం సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోగా దానిని ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ విజ‌యంతో క‌వ‌ర్ చేశాడు వ‌రుణ్‌తేజ్‌. ఈ హిట్టు వ‌రుణ్‌ కి కొత్త ఊపు ఇచ్చింది. అందుకే ఇప్పటి నుండీ అయినా కెరీర్‌ ని జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటే ఇక ఎలాంటి ఢోకా ఉండ‌దని సీనియర్ల సలాహా అందుకున్న వరుణ్ జాగ్రత్తపడ్డాడని అంటున్నాడు. వ‌రుణ్ చేతిలో మంచి సినిమాలే ఉన్నాయిప్పుడు. ఇలాంటి టైంలో ఎంతో అనుభవమున్న సీనియర్ ల సలహాలు తీసుకుంటున్న వరుణ్ ఇప్ప‌టికే ఒప్పుకున్న కొన్ని క‌థ‌ల విష‌యంలో ఆ సినిమా మేకర్స్ కి షాక్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. త‌మిళంలో హిట్ట‌యిన జిగ‌ర్తండా రిమేక్ తెలుగులో తీస్తున్న సంగతి తెల్సిందే. రీమేక్ స్పెషలిస్ట్ హరీష్ శంకర్ ఈ బాద్యతను తలకేత్తుకోగా హీరోగా నాగశౌర్య, విలన్ షేడ్స్ ఉన్న బాబీ సింహా పాత్రకు వరుణ్ ని ఒప్పించారని వార్తలు కూడా వచ్చాయి. నిజానికి విల‌న్‌కి త‌గిన బాడీ లాంగ్వేజ్ వ‌రుణ్ కి ఉంది ఉన్నాయి. ఈ సినిమా చేస్తే న‌టుడిగా త‌న‌లోని మ‌రో కోణాన్ని బ‌య‌ట‌కు తీసే అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే. కానీ ఈ సినిమా విష‌యంలో ఇప్పుడు వ‌రుణ్ తన నిర్ణయం వెనక్కి తీసుకున్నాడట. కేరీర్ గ్రాఫ్ సెట్ అవకముందే ఇలా విలన్ రోల్స్ చేయడం మంచిదికాదని భావిస్తున్నాడట. దాంతో వ‌రుణ్ ఈ సినిమా నుంచి డ్రాప్ అయిన‌ట్టు స‌మాచారం అందుతోంది. ఇది హరీష్ శంకర్ కు పెద్ద షాకే. ఎందుకంటే ముందు రవి తేజ, ధరమ్ తేజ లకి ముందు కదా చెప్పి డేట్స్ అడిగిన అయన, వారు ఓకే చెప్పినాక వారికీ సమాచారం ఇవ్వకుండా వరుణ్, శౌర్యలను ఓకే చేసుకున్నాడు. ఇప్పుడు వరుణ్ హ్యాండ్ ఇస్తే ఏమి చేస్తాడో మరి ?

More Related Stories