English   

అవును రామ్ చరణ్ సినిమా పోయింది.. అయితే ఏంటి ఇప్పుడు..

DVV-Danayya
2019-01-19 06:18:25

ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. ఆ చిత్ర నిర్మాత డివివి దానయ్య. సంక్రాంతికి విడుదలైన వినయ విధేయ రామ దారుణంగా పరాజయం పాలైంది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రంపై మెగా అభిమానుల భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ వాళ్ళ ఆశలు ముంచేస్తూ సినిమా దారుణంగా డిజాస్టర్ అయిపోయింది. తొలి రోజు మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత ఎప్పుడూ పైకి లేచే ప్రయత్నం చేయలేదు. ఇప్పటివరకు వారం రోజుల్లో 50 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదని రామ్ చరణ్ కూడా మీడియా ముందుకు రావడం మానేశాడు. కైరా అద్వానీ కూడా బాలీవుడ్ వెళ్ళిపోయి అర్జున్ రెడ్డి సినిమాతో బిజీగా ఉంది. మరోవైపు బోయపాటి శ్రీను అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు. ఇలాంటి సమయంలో భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించిన నిర్మాత చాలా ధైర్యంగా కనిపిస్తున్నాడు. అవును సినిమా పోతే పోయింది ఇప్పుడేంటి మనం చేయాల్సిన పని చేసుకోవాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు దానయ్య. ఈయన నమ్మకానికి కారణం రాజమౌళి సినిమా. అది చేతిలో ఉంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు డి.వి.వి.దానయ్య. రామ్ చరణ్ సినిమా పోతే పోయింది తర్వాత రాజమౌళి సినిమా ఉంది కదా అంటూ ధైర్యంగా ఉన్నాడు. దానికి తోడు టేబుల్ ప్రాఫిట్ అందుకున్నాడు ఈ నిర్మాత.

More Related Stories