English   

తమిళనాట పొంగల్ వార్ లో పైచేయి ఎవరిది.. అజిత్ కొట్టేశాడా..

PETTA
2019-01-19 07:39:42

తెలుగులో సంక్రాంతి విజేత ఎవరో ఇప్పటికే తెలిసిపోయింది. ఇక్కడ పెద్దగా పోటీ లేకుండానే వెంకటేష్, వరుణ్ తేజ సినిమా కు పట్టం కట్టేశారు ప్రేక్షకులు. మరి తమిళనాట కూడా రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి కదా.. అక్కడ విజేతగా ఎవరు నిలిచారు.. అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఉన్న అనుమానాలు. దీనికి సమాధానం కాస్త ఆలస్యంగా వచ్చింది. ఒక వారం ముగిసిన తర్వాత కానీ తమిళనాట సంక్రాంతి విజేత ఎవరు అనేది తేలలేదు. ప్రస్తుత లెక్కల ప్రకారం 2019 పొంగల్ విన్నర్ అజిత్ అని తెలుస్తోంది. ఈయన నటించిన విశ్వాసం సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది. రెండో వారంలో సినిమా ఎక్కడా తగ్గకుండా దుమ్ము దులిపేస్తుంది. మరో వైపు ఈ సినిమాతో పాటు విడుదలైన పేట సినిమా ఓపెనింగ్స్ లో అదరగొట్టిన కూడా ఆ తర్వాత మాత్రం చల్లబడిపోయింది. చాలా చోట్ల ఇప్పటికే కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి కూడా. రజినీకాంత్ ఉన్నా కూడా ఈ సినిమాను సేఫ్ జోన్ కు తీసుకురావడం అసాధ్యంగా కనిపిస్తోంది. సినిమా విజయం సాధించాలంటే 120 కోట్లు రావాలి.. కానీ ఇప్పటి వరకు వచ్చింది 54 కోట్లు మాత్రమే. ఇకపై భారీ వసూళ్లు వస్తాయనే నమ్మకం కూడా లేదు. రెండో వారంలో చాలా చోట్ల ఈ సినిమా నెమ్మదించింది. ఇదే సమయంలో అజిత్ విశ్వాసం మాత్రం రెండో వారంలో కూడా మంచి వసూళ్లు సాధిస్తూ ముందుకు వెళుతుంది. దాంతో పొంగల్ విన్నర్ అజిత్ అని తేలిపోతుంది. మొత్తానికి రజినీకాంత్ ఖాతాలో మరో సినిమా పరాజయంగా మిగిలిపోతుందని తెలుస్తోంది. నమ్మడానికి ఇది కష్టంగా ఉన్నా పేట సినిమా కూడా కమర్షియల్గా వెనకబడే ఉంది.

More Related Stories