English   

అనిల్ రావిపూడిని వదలనంటున్న దిల్ రాజు..

anilravipudi
2019-01-19 09:58:29

బంగారు గుడ్లు పెట్టే బాతును ఎవరైనా వదిలి పెడతారా.. ఇప్పుడు దిల్ రాజు కూడా ఇదే చేస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడిని తన కంపౌండ్ దాటకుండా చూసుకుంటున్నాడు ఈ నిర్మాత. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణ సంస్థలో మూడు వరస సినిమాలు చేశాడు అనిల్ రావిపూడి. మూడు కూడా హిట్ అయ్యాయి. అన్ని సినిమాలు లాభాలు తీసుకొస్తుండడంతో అనిల్ రావిపూడిని వదలడానికి దిల్ రాజుకు మనసు రావడం లేదు. ఇప్పటికే ఈయన నిర్మాణంలో చేసిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2  సినిమాలు మంచి విజయం సాధించాయి. దాంతో ఇప్పుడు వరుసగా నాలుగో సినిమా కూడా తన బ్యానర్ లోనే చెయ్యాలని అనిల్ రావిపూడిని అడుగుతున్నాడు దిల్ రాజు. దీనికి ఈ కుర్ర దర్శకుడు కాస్త అసంతృప్తితోనే ఉన్నాడని తెలుస్తోంది. మూడు సినిమాలు చేయాలని పూర్తిచేశారు అనిల్ రావిపూడి.. ఇప్పుడు నాలుగో సినిమా కూడా ఆయన నిర్మాణంలోనే చేస్తే మిగిలిన నిర్మాతలకు ఎక్కడ దూరమైపోతానో అనే టెన్షన్ అనిల్ రావిపూడి లో ఉంది అని తెలుస్తోంది. అయితే దిల్ రాజు మాత్రం ఈ కుర్ర దర్శకుడికి కాదనలేని ఇస్తున్నాడు. రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా ఒక పెద్ద హీరోలు తీసుకొచ్చి అనిల్ రావిపూడి కి ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కోసమైనా అనిల్ తన బ్యానర్ లోనే మరో సినిమా చేస్తాడని దిల్ రాజు ఆశ. మరి ఈయన వేసిన స్కెచ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

More Related Stories