English   

పర్సనల్ స్టాఫ్ పెళ్ళికి వెళ్లి షాకిచ్చిన అఖిల్ !

Akhil
2019-01-19 10:10:46

ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి తమ దగ్గర పని చేసే వ్యక్తిగత సిబ్బంది పట్ల ఇతర బాషల నటీనటులు వ్యవహరించే తీరుతో పోలిస్తే మన వాళ్ళు వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు. తెలుగులో బహిరంగంగా చేయి చేసుకునే వాళ్ళు ఒకరిద్దరు ఉన్నా మిగతావాళ్ళు తమ తమ పర్సనల్ సిబ్బందిని చాలా బాగా చూసుకుంటారు. తమతమ పర్సనల్ స్టాఫ్ మీద కొందరు సెలబ్రిటీలు చిరాకు పడుతుంటే దానికి పూర్తి విరుద్దంగా మరికొందరు వారికి గౌరవ మర్యాదలు ఇస్తూ వాళ్ళ ఇళ్లలోని శుభకార్యాలకు హాజరై వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుంటారు. ప్రభాస్, మహేష్ బాబు మొదలు చాలా మంది ఈ కోవలోకే వస్తారు. తాజాగా ఈ లిస్టులో అక్కినేని వారసుడు అఖిల్ కూడా చేరిపోయాడు. తాజాగా అక్కినేని అఖిల్ తన పర్శనల్ స్టాఫ్ లో ఒకరి వివాహానికి హాజరయ్యాడు. అఖిల్ పర్సనల్ స్టాఫ్ లో ఒకరైన మోసెస్ వివాహం ఇతెవలె తూర్పు గోదావరి జిల్లా కడియంలో జరిగింది. ఈ శుభకార్యానికి హాజరయిన అఖిల్ నూతన వధూవరులను ఆశీర్వదించి ఆల్ ది బెస్ట్ చెప్పి ఆశ్చర్యపరిచాడు. మరోపక్క ఈరోజు సాయంత్రం అఖిల్ తాజా మూవీ మిస్టర్ మజ్ను ప్రి రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించి, అఖిల్ జతగా నిధి అగర్వాల్ నటించిన ఈ సినిమా జనవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. 

More Related Stories