English   

రామ్ తో అజయ్ భూపతి సినిమా అందుకే ఆగిందా ?

Ram-Pothineni
2019-01-19 10:32:19

ఆర్‌ఎక్స్‌100 విడుద‌ల కాక ముందు అజయ్ వర్మ దగ్గర ఉన్న పదుల మంది అసిస్టంట్ లలో ఒకడు, కానీ ఎప్పుడయితే ఆర్ఎక్స్ 100 విడుదలయ్యిందో ఆయనకు ఆఫర్ లు వెల్లువలా వచ్చి పడ్డాయి. నితిన్, రామ్ లాంటి వాళ్ళు చాలా మంది ఆయన్ని తమతో సినిమా చేయమని తమ తమ బ్యానర్ ల ద్వారా ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. నితిన్ తో ఒకటి, రామ్ తో సినిమాలు కూడా ఓకె అయ్యాయని ప్రచారం కూడా జరిగింది. నితిన్ సంగతి పక్కన పెడితే రామ్ తో స్టోరీ సిట్టింగులు కూడా అయ్యాయి. క‌థ కూడా సరే అనుకున్న తరుణంలో ఆ సినిమా పక్కన పెట్టి పూరితో `ఇస్మార్ట్ శంక‌ర్‌`ని ప‌ట్టాలెక్కించేశాడు రామ్‌. అయితే ఈ ఇదరి కాంబినేషన్ సినిమా ఎందుకు మొదలవ్వలేదనే దానికి తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది. నిజానికి అజ‌య్ భూప‌తి చెప్పిన క‌థ‌ని రాం ఓకే చెసాడట. కానీ దానిలో కొన్ని మార్పులూ చేర్పులూ సూచించాడ‌ట‌. అయితే వర్మ దగ్గర పని చేసి వచ్చిన అజయ్ అసలు ఆ మార్పులు చేర్పులూ ఏమీ ఉండవని తేల్చి చెప్పాడట. అయితే రెండో సినిమాకే ఇలా ఉంటే తనతో సినిమా కష్టమే అని రామ్ తేల్చాడట. అందుకే ఆయన సినిమా ఓకే అయినా పూరితో సినిమా మొదలుపెట్టాడని అంటున్నారు. రామ్ త‌న త‌దుప‌రి సినిమాని పూరితో ప్ర‌క‌టించేస‌రికి అప్ప‌టిక‌ప్పుడు అదే క‌థ‌ని బెల్లంకొండ శ్రీ‌నివాస్‌ కి చెప్పి ఓకే చేయించుకున్నాడు అజ‌య్. ఈ విషయం బయటకు ప్రకటించపోయినప్పటికీ తాజాగా బెల్లం కొండ పుట్టినరోజున ఒకరకమైన హింట్ ఇచ్చాడు అజయ్. అంటే ఇప్పుడు బెల్లంకొండ‌తో చేయ‌బోతున్న సినిమా క‌థ‌ రామ్ కోసం త‌యారైన‌దే. రామ్ క‌థ‌ బెల్లంకొండ కు చేరిందన్న మాట. బెల్లం బాబు రామ్ లాగా స్క్రిప్టులో మార్పులేమీ  చెప్ప‌కుండానే ఓకే చేసేశాడ‌ట‌. మరి ఫ్లాపుల్లో ఉన్న బెల్లం బాబుకి అజయ్ ఈ సినిమాతో హిట్ ఇస్తాడేమో చూడాలి మరి.

More Related Stories