English   

కార్తికేయ సరసన మలయాళీ ముద్దుగుమ్మ !

Kartikeya
2019-01-19 18:04:24

చిన్న సినిమాగా రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన చిత్రాలలో ఆర్ ఎక్స్ 100 ముందు వరుసలో ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయిని మోసం చేసే స్టోరీలైన్ తో తెరకెక్కించిన ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడం తో సంచలన విజయం నమోదు చేసి పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు మొత్తాన్ని కలెక్ట్ చేసి పెట్టింది. ఈ దెబ్బకి సినిమా యూనిట్ దశ తిరిగినట్టే. దర్శకుడు అజయ్ భూపతికి వెళ్ళు లో అవకాశాలు వచ్చి పడటంతో పాటు హీరో కి కూడా అవకాశాలు పోటెత్తాయి. అయినా కార్తికేయ ఎక్కడ తొందర పడకుండా తనదైన శైలిలో ఉండే సబ్జెక్ట్ లు మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తన రెండో మూవీ గా బైలింగ్యూయల్ సినిమా హిప్పీ చేస్తున్నాడు. ఇక ఆయన తాజా చిత్రం బోయపాటి శీను దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన అర్జున్ జంధ్యాల అలియాస్ మల్లి దర్శకత్వంలో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఒంగోలులో మొదలైంది. షూటింగ్ అయితే మొదలు పెట్టారు గాని ఇప్పటిదాకా హీరోయిన్ ఎంపిక చేయలేదు. దీంతో కార్తికేయ పక్కన కథానాయిక ఎవరు ఉంటారని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొని ఉంది. అతి ఎదురుచూపులతో బ్రేక్ చేస్తూ హీరోయిన్ ఎవరో ప్రకటించింది సినిమా యూనిట్. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం మలయాళ ముద్దుగుమ్మ 'అనఘ మరుతోర'ను ఎంపిక చేశారట. గత ఏడాది తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, ఈ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ అమ్మాయి స్వతహాగా మంచి డాన్సర్ అని తెలుస్తోంది.

More Related Stories