English   

రకుల్ కు సపోర్ట్ చేసిన చిన్మయి.. వాళ్లను చంపేయాలి !!

Rakul
2019-01-19 19:04:13

సోషల్ మీడియాలో ఇప్పుడు రకుల్ పేరు మారుమోగి పోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఈమె డ్రెస్ గురించి ఒక నెటిజన్ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్న నిక్కరు వేసుకుని కారులోంచి దిగిన ఫోటోను చూసి దారుణమైన కామెంట్స్ చేశాడు ఓ నెటిజన్. దీనిపై రకుల్ కూడా మండిపడింది. ఇక ఇప్పుడు ఈమెకు సపోర్టుగా సింగర్ చిన్మయి బయలుదేరింది. ఆడవాళ్లు ఏం చేసినా ఊరుకుంటారు.. వాళ్లకు ఓపిక ఎక్కువగా ఉంటుంది అని.. ఎవడు పడితే వాడు కామెంట్ చేస్తున్నాడని కానీ అది పోయి అమ్మాయిలు కూడా తిరగబడతారు అని నిరూపించాల్సిన సమయం వచ్చిందంటుంది చిన్మయి శ్రీపాద. ఇప్పుడు రకుల్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని గుర్తు చేసింది ఈ భామ. మహిళలను ఏదో తమకు రాసి ఇచ్చేసినట్లుగా కొంత మంది విర్రవీగుతుంటారని.. అలాంటి వాళ్లకు కచ్చితంగా బుద్ధి చెప్పాలి అంటోంది చిన్మయి. సోషల్ మీడియాలో ఇలా విమర్శించడానికి ఎప్పుడు కొందరు కంకణం కట్టుకొని సిద్ధంగా ఉంటారని.. వాళ్లు అసభ్యకర సందేశాలు పెట్టినా కూడా వాళ్ళను గౌరవంగానే సంబోధించాలా అంటూ ప్రశ్నిస్తోంది చిన్మయి. అలాంటి వాళ్లకు గౌరవం ఇవ్వాల్సిన పనిలేదు.. అసలు అలాంటి వాళ్లు ఎందుకు బ్రతికి ఉంటారో కూడా అర్థం కావడం లేదు అంటుంది చిన్మయి శ్రీపాద. తనను కూడా రేప్ చేస్తామని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఉంటారని ఇలాంటి వాళ్లని చంపేయాలి.. అప్పుడు సమాజం బాగుపడుతుందని చెబుతోంది ఈ సింగర్. అమ్మాయిలకు స్వేచ్ఛ ఇస్తున్నాం అంటారు ఎక్కడ ఇస్తున్నారు అంటూ ప్రశ్నిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి ఇప్పుడు రకుల్ ఇష్యూ నేషనల్ వైడ్ గా కూడా ట్రెండింగ్ అవుతుంది.

More Related Stories