English   

కూచిపూడివారి వీధి...అడ్డాల ఈజ్ బ్యాక్ !

Srikanth-Addala
2019-01-19 19:49:55

మహేష్‌బాబు హీరోగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మళ్లీ మెగాఫోన్ పట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయినా అంతకు ముందు హిట్ ఇచ్చిన దర్శకులకి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ముందు రెండు సినిమాలు హిట్ ఇచ్చినా మూడో సినిమాగా వచ్చిన 'బ్రహ్మోత్సవం' పరాజయంపాలు కావడంతో, ఆయనకి చాలా గ్యాప్ వచ్చింది. ఒకటి రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించడానికి ఆయన ప్రయత్నించినా అది ఫలితం లేకుండా పోయింది. ఆయన తన నెక్స్ మూవీ కోసం సన్నాహాలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయన్ని ఆయనే కన్ఫాం చేసేశాడు. సంక్రాంతి పండుగకి తన సొంత ఊరు 'రేలంగి'కి వెళ్లిన ఆయనని అక్కడ మీడియా పలకరించి తర్వాతి సినిమా ఎప్పుడు ఉంటుందన్న విషయం ఆరా తీసింది. దానికి అయన త్వరలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒక సినిమా చేయబోతున్నానని ఆ సినిమాకి 'కూచిపూడివారి వీధి' అనే టైటిల్ అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. కమల్ హాసన్, వెంకటేశ్  కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ చేయాలని వారికి తగ్గ కథను కూడా సిద్ధం చేశాడట. అంతే కాదండోయ్ ఆయన ఈ ఏడాది నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం కూడా వుందట. అయితే అందుతున్న సమాచారం ప్రకారం గీతా ఆర్ట్స్ సినిమాని హీరో నానీతో ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం నాని ‘జెర్సీ’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆయన తర్వాత సినిమా కూడా విక్రమ్ కుమార్ తో చేస్తున్నట్టు ప్రకటించాడు. మరి శ్రీకాంత్ అడ్డాలతో చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.
 

More Related Stories