English   

మిస్టర్ మజ్ను ఈవెంట్ లో క్విడ్ పోక్రో !

jr ntr speech at mr majnu pre-release event function
2019-01-20 16:02:00

అక్కినేని వారసుడు అఖిల్ నటిస్తున్న మూడో చిత్రం మిస్టర్ మజ్ను మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిన్న రాత్రి నిర్వహించారు. ఈ ఈవెంట్ కి యంగ్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అక్కినేని, నందమూరి వారసులు ఒకే వేదికపైకి రావడంతో ఇరు కుటుంబాల అభిమానులకి కన్నుల పండుగ అనే చెప్పాలి. సినిమా తొలి టికెట్‌ ‌ను నాగార్జున చేతుల మీదుగా ఎన్టీఆర్‌కు అందజేశారు. ఈ సందర్బంగా ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు అఖిల్, తారక్ లు. తమ్ముడు అఖిల్‌లో ఆత్మ విమర్శ చేసుకునే చాలా గొప్ప గుణం ఉందని, చాలా తక్కువ మంది నటులలో మాత్రమే తాను ఆ గుణాన్ని చూశానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఓ నటుడికి కావాల్సిన క్వాలిటీ ఆత్మ విమర్శ చేసుకోవడమని ఎన్నిసార్లు తనను తాను ఆత్మ విమర్శ చేసుకుని అఖిల్ ఈ స్థాయికి చేరాడన్నారు. ఎదో ఒక రోజు టాలీవుడ్‌ లో ఉన్న ఫైనేస్ట్ యాక్టర్స్ లో అఖిల్ ఒకడిగా నిలిచిపోతాడనని ధీమా వ్యక్తం చేశారు. మిస్టర్ మజ్ను మూవీ అఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవాలని ఆకాంక్షించారు. అలాగే తాను ఈ ఫంక్షన్‌కు ఓ గెస్ట్‌లా కాదు ఓ కుటుంబసభ్యుడిగా వచ్చానని ఇక్కడ కేవలం అఖిల్, చైతు, బాబాయ్‌(నాగార్జున) మాత్రమే కాదు, సినిమాకు పనిచేసిన చాలా మంది నాకు కావాలసిన వాళ్లు ఉన్నారని నిర్మాత, తమన్, దర్శకుడి గురించి చెప్పుకొచ్చాడు. అలాగే తనకి బాగా కావలసిన వెంకీ అట్లూరి అని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకున్న కొద్దిమంది ఫ్రెండ్స్‌లో వెంకీ ఒకడని, నటుడిగా పరిచయమై తర్వాత రచయితగా, తొలిప్రేమతో డైరెక్టర్‌ గా పరిచయమయ్యాడని చెప్పుకొచ్చాడు. నటన, రచన, దర్శకత్వం ఇలా ప్రతి విషయంలోకి వెళ్తున్నాడు. ఎందుకిలా చేస్తున్నాడో అనుకున్నానని కానీ తొలిప్రేమ చూసిన తర్వాత నేను చాలా గర్వంగా ఫీలయ్యా. తొలి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడని చెప్పుకొచ్చాడు. మిస్టర్ మజ్ను కూడా భారీ విజయం సాధిస్తుందని నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు. ఇక మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ ని తాను ‘టైగర్’ అనే పిలుస్తానని, నిజంగా, ఆయన ‘టైగరే’ అని అఖిల్ అక్కినేని ప్రశంసించాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ వేరని, తారక్ గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఊరుకోడని, ఓ సందర్భంలో తను ‘థ్యాంక్స్’ చెప్పినా కూడా ఒప్పుకోలేదని, ఇది తన బాధ్యత అని తారక్ అన్నాడని అఖిల్ చెప్పుకొచ్చాడు. 

More Related Stories