English   

విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా అనసూయ !

Vijay Deverakonda's bumper offer to Anasuya
2019-01-20 09:34:27

ఏంటీ విజయ్ సినిమాలో హీరోయిన్ గా అనసూయనా ఇదేంటీ అనుకుంటున్నారా ? అసలు విషయం ఏంటో తెలియాలంటే పూర్తి స్టోరీ చదవండి. టాలీవుడ్ లో తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఎక్కువ మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి అతని జీవితాన్ని మార్చేసి, ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు సోసోగానే ఉన్నా మళ్ళీ గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తోడవ్వడంతో ఇక అతని ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. ఇక విజయ్ తాజాగా ఒక ఫాషన్ బ్రాండ్ కూడా ఏర్పాటు చేసి వ్యాపారం మొదలుపెట్టగా ఇప్పుడు ఒక ప్రొడక్షన్ బ్యానర్ ను కూడా స్థాపించిన సంగతి తెలిసిందే. 'కింగ్ అఫ్ ది హిల్' అనే పేరుతో ఈ బ్యానర్ ఏర్పాటు చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన మొట్టమొదటి సినిమా 'పెళ్లి చూపులు' సినిమా దర్శకుడైన తరుణ్ భాస్కర్ ను హీరోగా పెట్టి ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి కదా, ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. అదేంటంటే తరుణ్ భాస్కర్ సరసన యాంకర్ అనసూయ హీరోయిన్ గా నటించబోతోందట. అయితే తరుణ్ భాస్కర్, అనసూయ మాత్రమే కాక మరో ఇద్దరు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ నలుగురి పాత్రల చుట్టూ సినిమా తిరగనుంది. మరో రెండు పాత్రలకిగాను ఆర్టిస్టుల ఎంపిక జరగవలసి వుంది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరనేది కూడా త్వరలో క్లారిటీ ఇస్తారట, హీరో గా ప్రేక్షకులను మెప్పించిన విజయ్ దేవరకొండ నిర్మాతగా ఎంత వరకు మెప్పించగలడో మరి. 

More Related Stories