English   

ప్రభాస్ పెళ్లి అప్పుడే...క్లారిటీ ఇచ్చిన రెబల్ స్టార్ !

actor krishnamraju about prabhas marriage
2019-01-20 20:56:03

టాలీవుడ్ లో మోస్ట్ ఇంటరెస్టింగ్ న్యూస్ ఏదైనా ఉందా అంటే అది ప్రభాస్ పెళ్లి అని చెప్పక తప్పదు. కొన్ని వెబ్ సైట్స్ కి యూత్యోబ్ చానల్స్ కి వ్యూస్ తగ్గాయి అనిపిస్తే వెంటనే ప్రభాస్ పెళ్లి ఫిక్స్ ...ఈ అమ్మాయితోనే...ఎవరో తెలుసా ? అంటూ కధనాలు వండి వార్చేస్తూ ఉంటారు. తాజాగా రాజమౌళి కొడుకు పెళ్ళికి చాలామంది వెళ్ళినా అనుష్క, ప్రభాస్ లు పక్కపక్కన కనపడడంతో మరిన్ని పుకార్లు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ప్రభాస్ పెళ్లి గురించి స్పందించారు ఆయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు. చాలా మంది  చాలా   సార్లు తనను ప్రభాస్ వివాహం అడుగుతున్నారని, సాహో సినిమా విడుదల కాగానే ఆ శుభకార్యం ఉంటుందని రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రకటించారు. ఈరోజు కృష్ణంరాజు పుట్టినరోజు నేపధ్యంలో ఆయనని ఓ దినపత్రిక ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ సమయంలో ప్రభాస్ పెళ్లి విషయమే కాక మరిన్ని విషయాలను ఆయన పంచుకున్నారు. అలాగే ప్రభస్ తర్వాతి ప్రాజెక్ట్ కూడా ఆయన చూచాయగా చెప్పేశారు. త్వరలోనే గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ తో లవ్ స్టోరీ నిర్మిస్తామని, అందులో తాను కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నానని ఆయన ప్రకటించారు. 

More Related Stories