English   

మిస్టర్ మజ్ను ట్రైలర్ టాక్...ఏదో తేడా కొడుతోందే ?

Akhil Akkineni Mr Majnu Movie Trailer Talk
2019-01-20 21:40:48

అక్కినేని అఖిల్ న‌టించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో అఖిల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నటించిన తాజా చిత్రం మిస్ట‌ర్ మ‌జ్ను హిట్ కొడుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. తొలిప్రేమ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన వెంకీ అట్లూరి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.ఈ సినిమా ట్రైలర్‌ ను నిన్న రిలీజ్ చేశారు. 2.08 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌‌లో అఖిల్ క్రేజీ లవర్ బాయ్‌ గా కనిపిస్తున్నాడు. అదేంటో గానీ ట్రైలర్ చూస్తున్నంత సేపు రామ్ చరణ్ అప్పట్లో హీరోగా నటించి బాబాయ్ నాగబాబుకి భారీ నష్టాన్ని మిగిల్చిన ఆరెంజ్ సినిమా ఆనవాళ్లు మెండుగా కనిపిస్తున్నాయి. ఆ సినిమాలో హీరో ఒకరినే ఎక్కువ కాలం లవ్ చేయకపోవడం లాంటి కాన్సెప్ట్ మిస్టర్ మజ్ను ట్రైలర్‌ లో కూడా కనిపించింది. అలాగే హీరోని చూసి అమ్మాయిలు పడిపోయే విధానం చూస్తే వంకీ అట్లూరి మొదటి సినిమా తొలిప్రేమ షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి. సినిమా గనుక ఈ లైన్స్ బేస్ చేసుకుని తెరకెక్కించినట్టు అయితే గనుక సినిమా ఫలితం ఊహించిన స్థాయిలో రాకపోవచ్చు. అదే జరిగితే అఖిల్ హ్యాట్రిక్ కొట్టేస్తాడు. ఏమి జరగనుందో మరి ?

More Related Stories