English   

విశాల్ - అనీశా లవ్ స్టోరీ ఇదేనట !

Vishal reveals how he fell in love with Anisha Alla Reddy
2019-01-20 14:57:27

తెలుగు వాడయినా తమిళంలో ఫేమస్ అయిన విశాల్ అర్జున్ రెడ్డి ఫేం నటి అనీశాను లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ముందు విశాల్ తండ్రి ప్రకటించినా విశాల్ మాత్రం ఇలా చెత్త రూమర్స్ స్ప్రెడ్ చేయద్దని క్లాస్ పీకాడు. ఆ తర్వాత తన ప్రేయసే స్వయంగా ప్రకటించడంతో విశాల్ ఒప్పుకోక తప్పలేదు. అయితే ఆ అమ్మాయి అసలు ఎలా పరిచయం అయ్యిందనే విషయం చెప్పుకొచ్చాడు. అయోగ్య సినిమా షూటింగ్‌ కోసం వైజాగ్‌ వచ్చినప్పుడు ఆమె పరిచయం అయ్యిందని, అనీశా తన స్నేహితులని వెంట పెట్టుకుని తనను కలవడానికి వచ్చిందని చెప్పుకొచ్చాడు. మైఖెల్‌ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నానని ఇది వ్యవసాయం నేపథ్యంలో సాగే సినిమా అని, యూనిట్‌ కు వాళ్ళంతా వ్యవసాయదారులని చెప్పడంతో ఆ సినిమా తాను విడుదల చేస్తానని చెప్పానని విశాల్ అన్నారు‌. అలా కొన్నిసార్లు అనీశాను కలుసుకున్న తర్వాత ఆమెపై ప్రేమ పుట్టిందని, అప్పుడే ప్రపోజ్‌ చేశానని కానీ ఆమె సమయం తీసుకుని ఓకే చెప్పిందని తెలిపారు. ఇక వీళ్ళ పెళ్లి వేదిక కూడా ఖారరైయినట్టే, విశాల్ ముందు ప్రకటించినట్టుగానే చెన్నైలోని నడిగర్ సంఘం కొత్త బిల్డింగ్ లో విశాల్-అనీషాల పెళ్లి జరగబోతోందని సమాచారం.

More Related Stories