English   

ఫుట్ బాల కోచ్ గా కనిపించనున్న ఇళయ దళపతి !

Vijay and Atlee kick-start shoot for Thalapathy 63 with a puja
2019-01-20 22:50:03

తమిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన చివ‌రి చిత్రం స‌ర్కార్ ప‌లు వివాదాల మ‌ధ్య విడుద‌లై ఘన విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక డైరెక్ట‌ర్ అట్లీ - విజ‌య్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తేరి, మెర్స‌ల్ చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. త్వరలో వీరిద్దరూ మరో క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కించ‌నున్నారట. విజ‌య్ 63వ చిత్రంగా మొదలవుతున్న ఈ చిత్రం ఈరోజు పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనున్న‌ట్టు చెబుతున్నారు. రేప‌టి నుండి షూటింగ్ ప్రారంభం కానుంద‌ని సమాచారం. క‌తిర్‌, యోగి బాబు, వివేక్ ముఖ్య పాత్ర‌ల‌లో కనిపించ‌నున్న ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టించ‌నుంది. ఆస్కార్ గ్రహీత రెహ‌మాన్ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మకూరుస్తున్నారు. అయితే ఈ సినిమా మొత్తం ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్ అనీ, క్రీడా నేపధ్యంలోనే ఈ సినిమా రూపొంద‌నుంద‌ని, ఇందులో విజ‌య్ ఫుట్ బాల్ కోచ్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. కోచ్‌ గా విజ‌య్ త‌న అభిమానుల‌ని ఏ రేంజ్‌లో అలరిస్తాడో చూడాలి మ‌రి. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. దాంతో ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

More Related Stories