English   

మెగా కుటుంబంపై విమ‌ర్శ‌లు.. కొత్త వార‌సుడు ఏం చేస్తాడో..? 

Vaishnav-Tej
2019-01-21 11:09:43

చిరంజీవి అనే చెట్టు నీడ కింద వరసగా కొమ్మలు వస్తూనే ఉన్నాయి. ఒక్కరో ఇద్దరో అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఒకే కుటుంబం నుంచి 11 మంది రావడం అనేది చిన్న విషయం అయితే కాదు. నందమూరి కుటుంబంలో కూడా నలుగురికి మంచి హీరోలు లేరు. అలాంటిదిప్పుడు మెగా కుటుంబం నుంచి ఏకంగా పదకొండు మంది ఇండస్ట్రీకి వచ్చేశారు. నాగబాబు, నిహారిక పక్కన పెడితే తొమ్మిది మంది హీరోలు ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీలో ఉండటం విశేషం. ఇంతమంది ఒకే కుటుంబం నుంచి రావడం ఏంటి అనే విమర్శలు కూడా బయట వినిపిస్తున్నాయి. కావాలనే ప్రేక్షకులపై మెగా కుటుంబం నుంచి హీరోల‌ను రుద్దేస్తున్నారు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇంతమంది ఉండగా ఇప్పుడు మళ్లీ వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్నాడు. సాయి ధరంతేజ్ తమ్ముడు ఈయన. 

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ సంస్థల్లో ఈయన తొలి చిత్రం తెరకెక్కబోతుంది. బుచ్చిబాబు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇదే ఏడాది వైష్ణవ్ తేజ్ కూడా వెండితెరపై వైష్ణ‌వ్ తేజ్ క‌నిపించ‌బోతున్నాడు. సాయిధరంతేజ్ మొదట్లో కాస్త తడబడిన వరుస విజయాలతో ఇప్పుడు హీరోగా నిలదొక్కుకున్నాడు. మరి ఆయన తమ్ముడి పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ మాత్రమే నిరూపించుకోలేకపోయారు. మరి ఇప్పుడు వైష్ణవ్ తేజా ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories