English   

నిధి అగ‌ర్వాల్ ను అఖిల్ ఆదుకుంటాడో లేదో..? 

Nidhi-Agarwal
2019-01-21 05:32:57

బాలీవుడ్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఒక్క హిట్టు అంటూ అల్లాడిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్. సవ్య‌సాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అక్కినేని వారసుల సాయంతో తెలుగు ఇండస్ట్రీ లో నిలబడిపోవాలని చూస్తుంది ఈ భామ‌. అయితే ఊహించని విధంగా స‌వ్య‌సాచి డిజాస్టర్ కావడంతో నిధి అగర్వాల్ ఆశ‌ల‌న్నీ గ‌ల్లంతైపోయాయి. అన్నయ్య షాకిచ్చినా కూడా తమ్ముడు మరో అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అఖిల్ తో ఈమె మిస్టర్ మజ్ను సినిమాలో నటిస్తోంది నిధి. జనవరి 25న ఈ చిత్రం విడుదల కానుంది. దీనిపై భారీ ఆశలు పెట్టుకుంది నిధి అగర్వాల్. ఈ సినిమాతో హిట్టు కొట్టి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్లేస్ ఏర్పరచుకోవాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇవన్నీ జరగాలంటే ముందు అఖిల్ సినిమా కచ్చితంగా విజయం సాధించాలి. ఇది ఏదైనా తేడాకొట్టింది అంటే నిధి పరిస్థితి గల్లంతే. అందుకే ఈ సినిమాలో భారీగా అందాలు ఆర‌బోసింది నిధి అగర్వాల్. గ్లామర్ షో విష‌యంలో ఎలాంటి అడ్డూ అదుపూ లేని ఈ ముద్దుగుమ్మ అడిగిందే తడువుగా అన్ని చూపించేస్తుంది. మరి మిస్టర్ మజ్ను సినిమాతో నిధి తెలుగులో ఎలాంటి మాయ చేయబోతుందో చూడాలి.

More Related Stories