English   

ప్రియా వారియ‌ర్ కు ప‌డిపోయిన అల్లు అర్జున్.. 

Priya-allu-arjun
2019-01-21 14:16:44

ఒకే ఒక్కసారి కన్నుగీటి ఇండియా మొత్తాన్ని త‌న వెంట‌నే తిప్పించుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ ముద్దుగుమ్మ కోసం నిజంగానే వార్ చేశారు కుర్రాళ్ళు. ఏం మాయ చేసిందో తెలియదు కానీ ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఇండియా మొత్తాన్ని తన వెంట తప్పించుకుంది ప్రియా వారియర్. ఇక ఇప్పుడు ఈమె నటించిన తొలి సినిమా ఒరు ఆదార్ ల‌వ్ తెలుగులో కూడా విడుదల కాబోతుంది. ఇక్కడ ఈ చిత్రాన్ని లవర్స్ డే పేరుతో విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఫిబ్రవరి 14 న సినిమా విడుదల కానుంది. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్గా జ‌న‌వ‌రి 23న చేయ‌బోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఇదే విషయం పోస్టర్ కూడా విడుదల చేసింది. ఈ మధ్యకాలంలో బయట సినిమాల ఆడియో వేడుకలకు బాగానే వెళుతున్నాడు అల్లు అర్జున్. ప్రియా వారియర్ కు కూడా తనవంతు సాయం చేస్తున్నాడు మెగా హీరో. ప్రియా వారియర్ ను చూసి తను మనసు పారేసుకున్నాని ఆ మధ్య చెప్పాడు అల్లు అర్జున్. మొత్తానికి ఒకే ఒక్క సీన్ తో అందరి మనసులు కొల్లగొట్టిన ప్రియా వారియర్ ఇప్పుడు అల్లు అర్జున్ సాయంతో తెలుగులో ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

More Related Stories