English   

నితిన్ ఏం చేస్తున్నాడో ఏమో.. మొత్తం కామెడీ కావాలంట‌.. 

Nithiin-Bhishma
2019-01-21 15:09:32

సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస ప్లాపులతో సతమతం అవుతున్న నితిన్.. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వస్తున్నాడు. ఈయన వరుసగా రెండు సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. ఈ రెండూ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జోనర్ లోనే ఉండబోతున్నాయని తెలుస్తోంది. చలో లాంటి పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించిన వెంకీ కుడుములతో ఒక సినిమా చేయబోతున్నాడు నితిన్. ఈ చిత్రానికి భీష్మ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. రష్మిక మందన్న హీరోయిన్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. కేవలం ఆరు నెలల్లోనే షూటింగ్ పూర్తిచేసి ఆగస్టులో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.  ఈ సినిమాతో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు నితిన్.  కుమారి 21ఎఫ్ లాంటి సినిమాను తెరకెక్కించిన సూర్య ప్రతాప్ దీనికి దర్శకుడు. ఈ చిత్రం కూడా పూర్తిగా కామెడీగా ఉంటుందని తెలుస్తోంది. అ..ఆ లాంటి సూప‌ర్ హిట్ సినిమా తర్వాత ఇప్పటివరకు మళ్ళీ హిట్ కొట్టలేకపోయాడు నితిన్. దాంతో ఇప్పుడు ఈ హీరో కెరీర్ డైలమాలో పడిపోయింది. కచ్చితంగా హిట్ కొడితే కానీ నితిన్ కెరీర్ కు మంచి రోజులు రావు. అందుకోసమే ఒక్క విజయం అంటూ తంటాలు పడుతున్నారు ఈ కుర్ర హీరో. మరి ఈయన హిట్టు కోరికను సూర్య ప్రతాప్, వెంకీ కుడుముల నెరవేరుస్తారో లేదో చూడాలి.

More Related Stories