English   

వెంక‌టేశ్ తీరు జోరు మారిపోయిందిగా.. 

Venkatesh
2019-01-21 08:51:40

ఒక్క హిట్ ఎక్క‌డ‌లేని ఎన‌ర్జీ ఇస్తుందంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు వెంక‌టేశ్ ను చూస్తుంటే మాత్రం ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఈ చిత్ర విజ‌యంతో ఈయ‌న కెరీర్ మ‌ళ్లీ టాప్ స్పీడ్ కు వెళ్లిపోయింది. ఎఫ్2 విజయం తర్వాత కెరీర్ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు వెంకటేష్. ఈ చిత్రం తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు విక్టరీ హీరో. చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఆ జోరు ఇప్పుడు ఈ హీరోలో కనిపిస్తోంది. ఇదే ఊపులో ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు వెంకీ. ఇప్పటికే అనిల్ రావిపూడితో మరో సినిమా చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు వెంకటేష్. ఈయనతో పాటు మరో రెండు సినిమాలు కూడా వెంకటేష్ లిస్టులో ఉన్నాయి. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉండటం విశేషం. దర్శకుడుగా మారిన తర్వాత వెంకటేష్ తో సినిమా చేయని త్రివిక్రమ్.. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తున్నాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఇక ఈసినిమాతో పాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు ఈ హీరో. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు వెంకటేష్. పూర్తిగా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం రానుంది. దానికితోడు బాబీ దర్శకత్వంలో వెంకీ మామ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో నాగ‌చైత‌న్య మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. ఇవన్నీ ఇలా ఉండగా రానా హీరోగా ఒక మల్టీ స్టారర్ కూడా చేయబోతున్నాడు వెంకటేష్. మొత్తానికి చూస్తుంటే మరో మూడేళ్ల వరకు ఖాళీ లేకుండా గడిపేస్తున్నాడు.
 

More Related Stories