English   

చిరుతో కొరటాల సినిమా ఆగలేదు !

Chiranjeevi
2019-01-21 10:21:43

రాజకీయ రంగంలో ప్రవేశించి పార్టీ పెట్టి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగి చాన్నాళ్ళ పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత పర్ఫెక్ట్ కం బ్యాక్ ఖైదీ నెంబర్ 150 సినిమాతో మన ముందుకు వచ్చిన మెగా స్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా కోసం చాలా కష్టపడుతున్నారు. వందల కోట్ల బడ్జెట్ తో పాటు మార్కెట్ పెంచుకోవడం కోసం తమిళ స్టార్ ల తో పాటు బాలీవుడ్ స్టార్లను కూడా ఈ సినిమాలో భాగం చేసి షూట్ చేయడంతో ఎంత కాదనుకున్నా సినిమా లేట్ అవుతోందట. ఈ ఏడాదే విడుదల ప్లాన్ చేసినట్టు నిర్మాతగా వ్యవరిస్తున్న రామ్ చరణ్ చెబుతున్నా సినిమా విడుదల తేదీ ప్రకటిస్తే కాని క్లారిటీ వచ్చేలా లేదు. మరోవైపు సైరా తర్వాత చిరు ఎవరితో చేస్తాడన్న దాని మీద ఇప్పటికే రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా వినయ విధేయ రామ సినిమా ప్రీ బ్యాడ్మింటన్ రిలీజ్ ఈవెంట్ లో దానికి హాజరయిన త్రివిక్రమ్ ను ఉద్దేశిస్తూ నా తర్వాత సినిమా ఆయనతోనే అని చిరు ప్రకటించారు. దీంతో ముందే ప్రకటించిన చిరంజీవి, కొరటాల శివ మూవీపై ఆగిపో యిందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని తెలిసినప్పటి నుంచీ.. కొరటాల శివతో మూవీ ఉండటంలేదని, అది ఇంకా ఆలస్యం కానుందని ఏవేవో రూమర్స్‌ వినిపించాయి. అయితే వీటన్నంటి చెక్ పెట్టడానికి  కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్ని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ ప్రకటనను విడుదల చేశాయి. ఈ రెండు నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమా సైరా పూర్తైన వెంటనే ప్రారంభం కానుందని అఫీషియల్‌గా ప్రకటించేశారు. ఈ మూవీ ఆగిపోయిందని వస్తున్న వార్తలను ఖండిస్తూ.. ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని ఈ ప్రకటనలో పేర్కన్నారు. చిరంజీవి ప్రస్తుతం సైరా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల మాత్రం చిరంజీవి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక త్రివిక్రమ్ బన్నీతో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్ళే పనిలో ఉన్నారు. ఈ సినిమాకు పూర్తయ్యాక చిరుతో త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారు.

More Related Stories