English   

నరేష్ టార్గెట్ ఆ కుర్చీ అన్నమాట !

Actor-Naresh
2019-01-21 10:34:03

రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరి లక్ష్యం పెద్ద పదవే అంటే రాష్ట్రానికి సీఎం, దేశానికి పీఎం. అలాగే ఇప్పుడు మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) లో కార్య వర్గ సభ్యులకి మా ప్రెసిడెంట్ పదవి అన్న మాట. ఇదే విషయాన్ని తాజాగా బయట పెట్టాడు సీనియర్ నరేష్. మా అధ్యక్షుడిగా ఒక్కసారి తాను పని చేస్తే చాలని, ఇక, ఆ పదవి వైపు చూడనని సీనియర్ నరేష్ పెర్కొన్నారు. ప్ర‌స్తుతం మా అధ్య‌క్షుడిగా శివాజీ రాజా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇటీవ‌లే నిధుల విష‌యంలో గోల్ మాల్ జ‌రిగింద‌ని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నరేష్ ఆరోపించ‌డంతో పంచాయతీ మీడియాకెక్కింది. అయితే గత పరిస్థుతులని దృష్టిలో పెట్టుకుని సినీ పెద్దలు ముందే కట్టడి చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నరేష్ మా ఎన్నికలు జరగనున్నాయని చెబుతూ, అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయతీగా వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మా అధ్యక్ష పదవిలో ఎవరు పనిచేసినా ఒక పర్యాయం మాత్రమే ఆ పదవిలో ఉండాలని మాలో అనుకున్నామని చెప్పారు. అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఏకగ్రీవం కాని పక్షంలో ఎన్నికల బరిలో దిగడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ‘మా’ అధ్యక్షుడిగా తాను చేయాలనుకుంటున్నది ఆ పదవిపై వ్యామోహంతో కాదని, ధర్మాన్ని రక్షించేందుకని ఆయన సినిమాటిక్ స్టైల్ లో వ్యాఖ్యలు చేశారు. ప్ర‌తీసారి మా అధ్య‌క్ష ఎన్నిక‌లు ఏక‌గ్రీవంగానే జ‌రుగుతున్నాయి. ఈసారి కూడా అలాగే జ‌రిగేలా ఉంద‌ని మా వర్గాల నుంచి లీకైంది. న‌రేష్ కోరిక మేర‌కు ఆ బాధ్య‌త‌లు కూడా ఆయ‌న‌కు అప్ప‌గించే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు.  మరి ఇది ఎంతవరకూ నిజమో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడక తప్పదు.

More Related Stories