English   

ముప్పై లక్షల మైలురాయిని దాటేసిన బన్నీ !

Allu-Arjun
2019-01-21 10:45:16

సోషల్ మీడియా వచ్చాక హీరోల పని సులువు అయిపొయింది. ఒకప్పుడు తమకు సంబంధించిన ఒక అప్డేట్ కానీ ఒక న్యూ లుక్ కానీ విడుదల చేయాలంటే తమ పీర్వోలకి ఇస్తే అది తర్వాతి రోజు వచ్చే పేపర్ లలో వేయించేవాళ్ళు. అదికూడా స్టార్ స్టేటస్ ఉంటేనే...కాస్త అటూ ఇటూ ఉన్నవాళ్ళ ఫోటోలు అయితే వారం వరం వచ్చే స్పెషల్ బుక్ లో ఏదో ఒక మూలన పడేసేవాళ్ళు. కానీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపధ్యంలో ప్రతిదీ అరచేతిలోకి వచ్చేసింది. దీన్ని తెలుగు సేలేబ్రిటీలు బానే వాడుకుంటున్నారు. అయితే ఏప్రిల్ 2015 లో ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, ఆపై, తరచూ తనకు, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ వారికి మరింత చేరువయ్యాడు. ఈ క్రమంలో ఆయన ఫాలోవర్ల సంఖ్య 30 లక్షల మైలు రాయిని దాటింది. ట్విట్టర్ లో ఆ మాత్రం యాక్టివ్ గా ఉన్న ఆయనకు ఇది పెద్ద ఘనత అనిపించుకోదు అందుకోండి అది వేరే విషయం. కానీ ఈ విషయాన్ని ట్వీట్ చేసిన బన్నీ ట్విట్టర్ లో 3 మిలియన్ ఫాలోవర్లకు చేరినందుకు అందరికీ కృతజ్ఞతలనీ తన  మీద చూపించే ప్రేమే ఇందుకు కారణమని ఇందుకు చాలా సంతోషంగా ఉన్నానని ఇది తన బలం కాదనీ అభిమానుల దీవెనలేననీ వ్యాఖ్యానించాడు.  అయితే బన్నీకి తెలుగుతో పాటు మలయాళం లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆయన సినిమాలు అన్నీ అక్కడ కూడా రిలీజ్ అవుతున్నాయి. కొన్నాళ్ళలో ఆయన అక్కడ డైరెక్ట్ సినిమా చేసి తెలుగులో కూడా డబ్ చేసిన ఆశ్చర్యం లేదు.

More Related Stories