English   

పోర్న్ స్టార్ పాత్రలో  రమ్యకృష్ణ !

Ramya-Krishna
2019-01-21 11:52:33

ఒకానొక సమయంలో తెలుగు తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ హోదా అనుభవించిన రమ్యకృష్ణ తర్వాత కాలంలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కూడా నటనని కొనసాగిస్తూ తన తనదైన శైలిలో దూసుకువెళ్తుంది. హీరోయిన్ అమ్మ పాత్రలు చేస్తూ లేడీ విలన్ రోల్స్ చేస్తూ కొత్త కొత్త క్యారెక్టర్స్ తో అభిమానులను అలరిస్తోంది.

బాహుబలి చిత్రానికి గాను శివగామి పాత్రలో నటించడం కాక జీవించి సినిమాలో మంచి పేరు సంపాదించింది. అయితే ఇప్పుడు రమ్యకృష్ణ ఒకటే లింగం తీసుకుందని తెలుస్తోంది. ఆ డేరింగ్ నిర్ణయం ఏంటంటే రమ్యకృష్ణ ఒక తమిళ సినిమా లో పోర్న్ స్టార్ పాత్రలో నటించనుంది. తమిళంలో విజయ్‌ సేతుపతి, సమంత జంటగా త్యాగరాజన్‌ దర్శకత్వంలో సూపర్ డీలక్స్ అనే ప్రయోగాత్మక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి లేడీ గెటప్‌లో కనువిందు చేయనుండగా రమ్యకృష్ణ లీలా అనే శృంగార తారగా కనిపించనున్నారు. 

ఈ సినిమా విశేషాలను ఇటీవల దర్శకనిర్మాతలు మీడియాతో పంచుకున్నారు. శృంగార తార పాత్రకు ముందుగా సీనియర్ నటి నదియాను సంప్రదించగా పోర్న్ స్టార్ పాత్ర కావడం కాస్త బోల్డ్ గా నటించాల్సి రావడంతో ఆమె తిరస్కరించింది. దాంతో రమ్యకృష్ణను సంప్రదించగా ఆమె ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో సమంత కూడా రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల కానుందని తెలుస్తోంది.

More Related Stories