English   

అనుష్క సినిమాలో ఆ హాలీవుడ్ యాక్టర్ ని ఫైనల్ చేశారట !

Hollywood star Michael Madsen roped in to play villain in Anushka Shetty's film
2019-01-21 23:04:45

బాహుబలి 2 ఆ తర్వాత భాగమతి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనుష్క ఆ తర్వాత కొన్ని సినిమా ఫంక్షన్ల లో తప్ప సినిమాల్లో కనిపించలేదు. అయితే ఆమె కోనా వెంకట్ సహా నిర్మాత గా వ్యవహిస్తున్న ఒక సినిమా ఒప్పుకందని వార్తలు రాగా సంక్రాంతి రోజున దీని మీద అఫిషియల్ క్లారిఫికేషన్ ఇచ్చింది సినిమా యూనిట్. ఆ సినిమా పేరు సైలెన్స్. ఈ సినిమా కూడా థ్రిల్లర్ స్టోరీనే కావడం అదే కాక అంతర్జాతీయ విలువలతో సినిమా నిర్మిస్తామని మేకర్స్ చెప్పడంతో మరో మాట లేకుండా ఆమె ఓకే చేసేసిందట. ఈ సినిమాలో ఎవర్గ్రీన్ హీరో మాధవన్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా  ఇది ఒక మూకీ డ్రామా అని చెబుతున్నారు. అందుకే  సినిమాకు ‘సైలెన్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశార ట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ప్రముఖ నటులు, టెక్నీషియన్లు పనిచేయనున్నారు. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు కథను అందించడంతో పాటు సినిమాకి సహ నిర్మాతగానూ వ్యవహరించనున్నారు. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అత్యధిక శాతం అమెరికాలోనే చిత్రీకరించనున్నారు. అయితే ఈ సినిమాలో స్టార్ హాలీవుడ్ నటులు కూడా నటించనున్నట్లు గతంలో దర్శక నిర్మాతలు వెల్లడించారు. అయితే ఆ నటుల పేర్లు అయితే ఖరారు కాలేదు. ప్రస్తుతం ఒక నటుడిని దర్శక నిర్మాతలు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ అమెరికన్ నటుడు, ‘కిల్ బిల్’ స్టార్ మైఖేల్ మాడ్సెన్‌ ను మేకర్స్ సంప్రదించి రూ.3 కోట్ల పారితోషకం ఇచ్చేందుకు కూడా డీల్ మాట్లాడే సారట. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
 ‘సైలెన్స్’లో అనుష్కతో పాటు అంజలి, షాలిని పాండే, తెలుగు నటుడు సుబ్బరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం అనుష్క బరువు తగ్గాలని దర్శకుడు కోరడం తో ఆ పని మీద ఉందట.

More Related Stories