English   

రాజకీయాల్లోకి బెబో....క్లారిటీ ఇచ్చేసింది !

Kareena Kapoor Khan denies joining politics My focus will only be movies
2019-01-22 08:39:06

బాలీవుడ్‌ లో స్టార్ హీరోయిన్‌ గా చెలామణీ అయిన కరీనా కపూర్ కాస్త ఆఫర్స్ తగ్గడంతో ఇక త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని నిన్న సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే దీని మీద క్లారిటీ ఇచ్చిన బెబో తనకు అలాంటి ఉద్దేశమే లేదని స్పష్టం చేసింది. అలా పుట్టిందో ఎందుకు పుట్టిందో తెలీదు కానీ నిన్నటి నుండి ఆమె మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ బరిలో ఆమె నిలవనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ మీద క్లారిటీ ఇవ్వక తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను కొట్టి పారేసిన ఆమె ఏ పార్టీవారు రాజకీయాలకు సంబంధించి తనతో సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తన ధ్యాసంతా సినిమాలపేనే ఉందని చెప్పింది. కరీనా, సైఫ్ దంపతులకు ఒక బాబు ఉండగా ఆ బాబుకు తైమూర్ ఖాన్ అనే పేరు పెట్టడం అప్పటిలో వివాదానికి కారణం అయ్యింది. కాగా, మధ్యప్రదేశ్‌లో 15ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. భోపాల్ స్థానాన్ని కాంగ్రెస్ గెలవాంటే కరీనాకు సీటు కేటాయించాలని కోరుతూ స్థానిక కార్పొరేటర్ యోగేంద్ర సింగ్ చౌహాన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాయడంతో ఈ ప్రచారం మొదలైంది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కరీనా మామ (సైఫ్ అలీఖాన్ తండ్రి), మాజీ క్రికెటర్ టైగర్ పటౌడీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు అయితే అప్పుడు ఆయన ఓటమి పాలయ్యారు.

More Related Stories