English   

ఇండో-పాక్ బోర్డర్ లో గోపీచంద్ హల్చల్ !

Gopichand
2019-01-22 11:12:50

తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ బియర్డ్ తో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా నిన్నటి నుండి రాజస్తాన్ లో షూట్ మొదలయ్యింది. ఇండో - పాక్ సరిహద్దుల్లో ఈ షూట్ జరగనుంది. అక్కడ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారని సమాచారం. ఎప్పుడో లౌక్యంతో హిట్ కొట్టిన గోపీకి తర్వాత చేపుకోదగ్గ సినిమా లేదు. ఎన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేసినా కలిసి రావట్లేదని భావించిన గోపీ యాక్షన్ జోనర్ నే మళ్ళీ ఎంచుకున్నాడు. ఇక నిన్న గోపీచంద్ ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ వద్ద కనిపించారు. అక్కడ భారత జవాన్లతో ఆయన కరచాలనం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఫైట్ మాస్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌ని చిత్రీకరిస్తున్నారు. 45 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో రాజస్థాన్, న్యూఢిల్లీతో పాటు ఇతర ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయని ఈ సినిమాలో ఇంతవరకూ ఆయన చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కి భిన్నంగా ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని అంటున్నారు. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తోన్న గోపీచంద్ కి, ఈ సినిమాతోనైనా హిట్ కొడుతుందేమో చూడాలి.

More Related Stories