English   

వైష్ణ‌వ్ తేజ్ ఎలాంటి సినిమా చేస్తున్నాడు..? 

Vaishnav-Tej
2019-01-22 04:32:38

మెగా కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. ఇప్పుడు కొత్తగా వైష్ణవ తేజ్ కూడా వస్తున్నాడు. ఎప్పట్లాగే ఈయనపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి ప్రేక్షకుల్లో. ఈ కుర్రాడు ఏం చేస్తాడు.. కొత్తగా ఏదైనా ట్రై చేస్తాడా.. లేదంటే ఈయన కూడా మాస్ ఇమేజ్ వైపు అడుగులు వేస్తాడా అనే అంచనాలు అభిమానుల్లో కూడా ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీ కి వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత వరుస విజయాలతో దుమ్ము లేపాడు మెగా మేనల్లుడు. ఇప్పుడు సాయి ధరంతేజ్ త‌మ్ముడు అనే బ్రాండ్ తో వైష్ణ‌వ్ తేజ్ వస్తున్నాడు. దానికితోడు  మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిపి వైష్ణవ్ తొలి సినిమాను నిర్మిస్తుండటం అంచనాలు పెంచుతోంది. పూర్తిస్థాయి ప్రేమకథతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వైష్ణవ్ తేజ్. కచ్చితంగా ఈ సినిమాతో మెగా కుటుంబం నుంచి మరో హీరో ప్రేక్షకులకు నచ్చడం ఖాయం అంటున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఒకే కుటుంబం నుంచి ఎంత మంది హీరోలు రావడం కూడా అంత మంచిది కాదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కానీ టాలెంట్ ఉన్నప్పుడు వాళ్లే నిలబడతారు అంటున్నారు విశ్లేష‌కులు. లేకపోతే ప్రేక్షకులు కూడా పట్టించుకోని ఇది వరకే చాలాసార్లు నిజ‌మైంది కూడా. ఇప్పుడు వైష్ణవ తేజ్ విషయంలో కూడా ఇదే జరుగుతుందనే న‌మ్మ‌కంతో ఉన్నారు మెగా కుటుంబం. ఇదే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా కోసం సుకుమార్ ఎలాంటి కథ సిద్ధం చేసి ఉంటాడు అని అభిమానులు ఇప్పటినుంచే ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

More Related Stories