English   

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు న‌ష్టాల‌పై విమ‌ర్శ‌లు.. 

NTR-Kathanayakudu
2019-01-22 05:46:43

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదలకు ముందు బాలక్రిష్ణ నిర్మాతగా ఆరితేరిపోయాడు.. తొలి సినిమాతోనే లాభాల పంట పండిస్తున్నాడంటూ ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఇప్పుడు మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు బాలకృష్ణ. తన మార్కెట్ ను పట్టించుకోకుండా కథానాయకుడు సినిమాను ఏకంగా 72 కోట్లకు అమ్మేసి బ‌య్య‌ర్ల‌ను నిలువునా ముంచేశాడు బాలయ్య. సినిమాపై ఉన్న క్రేజ్ తో వాళ్లు కొన్నారు స‌రే.. అందులో బాలయ్య తప్పులేదు కానీ తన మార్కెట్ లో తనకు తెలిసినప్పుడు ఇంత భారీ రేట్లకు సినిమాను అమ్మడం మాత్రం బాలకృష్ణ చేసిన తప్పే అంటున్నారు విశ్లేషకులు. నిర్మాతగా బాలయ్య తొలి సినిమానే డిజాస్టర్ కావడం ఆయనకు రుచించడం లేదు. కథానాయకుడు సినిమాతో కచ్చితంగా బ్లాక్బస్టర్ అందుకుని నమ్మకంతో ఊహించని షాక్ ఇచ్చింది ఈ చిత్రం. దానికి తోడు తండ్రి బయోపిక్ కు ఇలాంటి ఫలితం రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు బాల‌య్య‌. కథానాయకుడు ఎలాగూ పోయింది ఇప్పుడు మహానాయకుడు సినిమా విషయంలో జాగ్రత్త పడుతున్నాడు బాలకృష్ణ. ఈ సినిమాకు జరిగిన తప్పులను మరోసారి జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. కచ్చితంగా మహానాయకుడు సినిమాతో విజయం సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు బాలకృష్ణ. మరి ఆ నమ్మకాన్ని మహానాయకుడు నిలబెడుతుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ సినిమా కూడా పోతే నిర్మాతగా బాలకృష్ణ పూర్తిగా ఫెయిలైనట్టే. ఈ రెండు సినిమాలే కాకుండా బోయపాటి శ్రీను తెరకెక్కించబోయే సినిమాను నిర్మిస్తున్నాడు బాలకృష్ణ.

More Related Stories