English   

వినయ విధేయ రామ కొత్త రికార్డ్ ! 

Ram-Charan
2019-01-22 06:09:48

రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో వినయ విధేయ రామ అంటూ వినయంగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు రామ్‌చరణ్. టైటిల్‌లో ఉన్న వినయ విధేయతలు సినిమాలో మిస్సవ్వడంతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు కాస్త బెంబేలు ఎత్తారు మొదటి రెండు రోజులు. యాక్షన్ సినిమాల దర్శకుడిగా పేరొందిన బోయపాటి శ్రీను రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా అంటే నెలకొన్న అంచనాలని ఈ సినిమా మొదటి రోజే తుడిచి పెట్టేసింది. ఇక సినిమాలో రామ్‌ చరణ్ ట్రైన్ మీద నిలబడి ద్వారకా నుండి బీహార్ వెళ్లిడం, విలన్ తలలు నరికితే వాటిని గద్దలు ఎత్తుకుపోవడం వంటి పాముతో కరిపించుకుంటే పాము చనిపోవడం లాంటి కొన్ని సీన్లు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయ్యాయి యూనిట్ ఆ సీన్లను తొలగించి థియేటర్లలో వదిలింది. అయితే ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్నా మొదటి రోజు ఏకంగా రూ.26కోట్ల షేర్ సాధించి ఆశ్చర్యపరిచింది. అంతకుమించిన షాక్ ఏంటంటే ఈ సినిమా రెండోవారంలోనూ స్టడీగా కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ వర్గాల వారిని షాక్ కి గురి చేస్తోంది. ఈ సినిమా 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. లాంగ్ రన్‌ లో మరో రూ.15కోట్ల కొల్లగొట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ప్లాప్ టాక్ తెచ్చుకుంటే ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఇన్ని కోట్లు రాబట్టడం అసాధ్యం. అలాంటిది డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఏకంగా రూ.60కోట్ల షేర్ రాబట్టడం అందరినీ  షాక్ కి గురి చేస్తోంది. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ‘ఎఫ్2’ మినహా మిగతావి సోసోగా ఉండడం కూడా ఈ సినిమా కలెక్షన్స్ కి ఊపు ఇస్తుందనే చెప్పాలి. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా తెలుగు రాష్ట్రాల్లో రూ.50కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.60కోట్ల షేర్ రాబట్టిన తొలి తెలుగు సినిమాగా ఈ సినిమా రికార్డులకి ఎక్కనుంది.  

More Related Stories