English   

అల్లు అర్జున్ కు ఊహించ‌ని షాక్ ఇచ్చిన చిరంజీవి.. 

Chiranjeevi
2019-01-22 07:16:10

అల్లు అర్జున్ కు ఊహించని షాక్ ఇస్తున్నాడు చిరంజీవి. అల్లుడికి అడ్డంగా తన సినిమాను తీసుకొస్తున్నాడు మెగాస్టార్. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆరు నెలలకు పైగా గ్యాప్ తీసుకొని ఈ సినిమా ఓకే చేసాడు బన్నీ. ఈ మధ్య కాలంలో చాలా వేగంగా సినిమాలు పూర్తి చేయడం అలవాటు చేసుకున్న మాటల మాంత్రికుడు.. ఇప్పుడు బన్నీ కోసం కూడా ఇదే చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఈ సినిమాను కేవలం ఎనిమిది నెలల్లో పూర్తి చేసి దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఇప్పుడు ఈ ప్లానింగ్ కు చిరంజీవి అడ్డుపడుతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న సైరా సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమాని సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసినా కూడా ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న తీరు చూస్తుంటే ఆగస్టులో కూడా రావడం కష్టంగానే కనిపిస్తోంది. దాంతో సినిమాను దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదేగాని జరిగితే సైరా దెబ్బ ముందు పడేది బన్నీ సినిమాపైనే. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా దసరాకి విడుదల చేయాలని అనుకుంటున్నారు కాబ‌ట్టి. అరవింద సమేత సినిమా కూడా దసరాకి వచ్చింది.. ఇప్పుడు బన్నీకి కూడా ఇదే సెంటిమెంట్ ఫాలో అవ్వాలని చూస్తున్న త్రివిక్రమ్ కు చిరంజీవి సైరా సినిమా అడ్డుగా మారింది. సైరా వచ్చిందంటే బన్నీకి మరో ఆప్షన్ లేదు.. చిరంజీవికి ఎలాగూ ఎదురెళ్ల‌లేడు కాబట్టి బన్నీ సైలెంట్ గా సైడ్ ఇచ్చి సంక్రాంతికి రావాల్సిందే. మరి చివరివరకు ఈ రేస్ ఎలా ఉండబోతుందో చూడాలి.
 

More Related Stories