English   

ఏఎన్నార్ బ‌యోపిక్ అలా ఉంటుందంట‌.. ఎన్టీఆర్ నేర్పిన పాఠం.. 

ANR-Biopic
2019-01-22 08:21:08

తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పుడు బయోపిక్స్ టైం నడుస్తుంది. ఒకప్పటి లెజెండరీ హీరోలు, హీరోయిన్ల జీవితాలను తెరకెక్కించే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే ఇప్పటికే సావిత్రి, ఎన్టీఆర్ జీవితాలు తెరపైకి వచ్చాయి. ఇక ఇప్పుడు నాగేశ్వరరావు జీవితం కూడా వెండి తెరపైకి వస్తుందని వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై నాగార్జున స్పందించి ఏఎన్నార్ బయోపిక్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈయన జీవితాన్ని సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ విషయమై ఇప్పటికే నాగార్జునతో కూడా చర్చించార‌ని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రాకపోయినా కూడా త్వరలోనే బయోపిక్ పై పూర్తిస్థాయి వివరణ రానుంది. నిజానికి ఇప్పుడు బ‌యోపిక్స్ సరిగ్గా వర్కౌట్ అయితే తప్ప కలెక్షన్ల వర్షం కురిపించడం లేదు. ఏదైనా తేడా జరిగింది అంటే ఎన్టీఆర్ కథానాయకుడు పట్టిన గతి తప్పదు. అందుకే నాగార్జున కూడా నాగేశ్వరరావు బయోపిక్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు. వెబ్ సిరీస్ అయితే చిన్నితెరపైనే కాబట్టి కచ్చితంగా చూస్తారని నమ్మకం ఉంటుంది. మొత్తానికి నాగేశ్వరరావు బయోపిక్ వెబ్ సిరీస్ గా వస్తే దాన్ని ఎవరు తెరకెక్కిస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More Related Stories