English   

ఆర్ఆర్ఆర్ కి ఫాన్సీ ఆఫర్ !

RRR
2019-01-22 10:07:49

బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా స్థాయిని పెంచేసిన రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ కథానాయకులుగా ఓ మల్టీ స్టారర్ రూపొందుతోన్న సంగతి తెల్సిందే. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రాజమౌళి కొడుకు పెళ్లి తదనంతర కార్యక్రమాల తర్వాత నిన్ననే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పాత్రల మీద రకరకాల ఊహాగానాలు వెలుబడతున్నాయి. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే అది విడుదల అయ్యేదాకా ఒక క్లారిటీ ఉండదు. యూనిట్ కి సంబంధించిన చిన్నా చితకా వారు లీకులు ఇవ్వాల్సిందే తప్ప హీరోలు కానీ నటులు లీకులు ఇస్తే జక్కన్న ఊరుకోడు. అయితే గతంలో వచ్చినట్టే ఈ సినిమా మీద మళ్ళీ గాసిప్ లు మొదలయ్యాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న దొంగ పాత్రలో కనిపించనున్నాడట. అడవి దొంగగా ఆయన పాత్ర సాగుతుందని ఎన్టీఆర్‌ను పట్టుకునే పోలీస్ అధికారి పాత్రలో చెర్రీ కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మూడు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనుండటంతో, ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం ఛానల్స్ మధ్య గట్టిపోటీ ఏర్పడిందట. జీ టెలివిజన్ నెట్ వర్క్ వారు తెలుగు, తమిళ, హిందీ శాటిలైట్స్ రైట్స్ కోసం 150 కోట్లు ఆఫర్ చేసినట్టుగా సమాచరం. అయితే అంతకు మించిన ఆఫర్ ఇంకా ఏమైనా వస్తుందేమో అన్న అనుమానంతో నిర్మాత దానయ్య ఈ ఆఫర్ ను హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది.  మరి ఈ విషయం మీద  నిజానిజాలు తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

More Related Stories