English   

చిరంజీవిపై అస‌హ‌నంతో ఉన్న తెలుగు నిర్మాత‌లు.. 

Chiranjeevi
2019-01-22 18:32:41

అవునా.. ఏంటి కార‌ణం అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈయ‌న తీరుపై నిజంగానే నిర్మాతలు అసహనంతో ఉన్నారు. ఈయన ఎప్పుడెప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడా.. ఆయ‌న‌తో సినిమాలు నిర్మించాలని చాలా రోజులుగా కొంతమంది నిర్మాత‌లు కాచుకుని కూర్చున్నారు. కానీ చిరంజీవి మాత్రం వరుసగా తన సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఖైదీ నెంబర్ 150 సినిమా రామ్ చరణ్ నిర్మాతగా మారి నిర్మించాడు. తండ్రి రీ ఎంట్రీ సినిమా కథ బయటి వాళ్లకు ఇవ్వడం ఎందుకు అని సొంతంగా నిర్మించాడు ఏమో అనుకున్నారు అభిమానులు. ఆ తర్వాత సైరా సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి బయట నిర్మాతలకు ఇవ్వడం ఇష్టం లేని రామ్ చరణ్ సొంతంగా తనే బాధ్యత తీసుకున్నాడు. అయితే ఇప్పుడు కొరటాల శివ సినిమా కూడా త‌నే నిర్మించడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి సినిమాను కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లోనే చేస్తుంటే త‌మ‌తో చిరంజీవి ఎప్పుడు సినిమాలు చేస్తారంటూ అడుగుతున్నారు మిగిలిన నిర్మాతలు. దీనిపై సమాధానం చెప్పడానికి మెగాస్టార్ కూడా మౌనంగానే ఉన్నారు. కొరటాల శివ సినిమా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. సమ్మర్లో ఈచిత్రం షూటింగ్ మొదలు కానుంది. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. మొత్తానికి చిరంజీవి వరసగా సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు చేస్తుండటం ఇప్పుడు మిగిలిన నిర్మాత‌లకు పెద్దగా నచ్చడం లేదు. అంతెందుకు మెగా నిర్మాత అల్లు అర‌వింద్ కు కూడా చిరంజీవి డేట్స్ దొరకక పోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

More Related Stories