English   

మిఠాయి టీజర్ : ఏమిటో ఈ కాన్సెప్ట్ !

Mithai-Release
2019-01-22 19:24:29

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజ్ కథానాయకులుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ సినిమా ‘మిఠాయి’. డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా రెడ్ యాంట్స్ బ్యానర్ మీద రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 22వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తూ ఒక టీజ‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. రాహుల్ రామ‌కృష్ణ గాడిద‌ పై కూర్చుని ఉండ‌గా, దానిని ప్రియ‌ద‌ర్శి నడిపిస్తూ మంచి రోజులు వస్తున్నాయి అచ్చే దిన్ ఆ రహా అంటూ, మీ అందరి జీవితాల్లోకి వెలుగులు తెస్తున్నాయని ఢమరుకం మోగిస్తూ చెబుతుంటాడు చివ‌రికి ఆ గాడిద రామ‌కృష్ణ‌ను కింద ప‌డేయ‌డంతో రామకృష్ణ, ప్రియ‌ద‌ర్శిఇద్దరూ దానిని  దానిని చూసి పారిపోతారు. అర్ధం కాని విధంగా ఉన్న ఈ టీజర్ లో వారిద్దరూ దుబాయ్ షేక్ ల వేషధారణలో ఉన్నారు. కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతోన్న 'మిఠాయ్' ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో మరి.

More Related Stories