English   

బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రీతీ !

Shalini-Pandey
2019-01-22 13:10:24

తెలుగు ఆడియన్స్ కి 'అర్జున్ రెడ్డి' సినిమాతో పరిచయమైన షాలినీ పాండే తొలి సినిమాతోనే కుర్రకారు మనసులను కొల్లగొట్టి చాలా మంది ఫోన్స్ లో వాల్ పేపర్ అయిపొయింది. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో, ఈ అమ్మాయి బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ ఆ సినిమా తరువాత తెలుగు నుంచి ఆశించిన స్థాయిలో ఆమెకి అవకాశాలు రాలేదు. దాంతో ఈమె ఇతర బాషల సినిమాలపై దృష్టి పెట్టింది. దీంతో మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలిగా నటించిన షాలిని తమిళంలో 100 పర్సంట్ లవ్ రీమేక్ లో జీవీ ప్రకాష్ కి జోడీగా నటించింది. ఇక తెలుగులో తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ న్యూ మూవీ 118లో రెండో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఆ తర్వాత తెలుగులో, తమిళంలో అవకాశాలు లేక డల్ గా ఉన్న ఈమెకి బాలీవుడ్ ఆఫర్ వచ్చిందట. హిందీ నటుడు పరేష్ రావల్ కుమారుడు ఆదిత్య కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమా బాంఫాడ్ లో షాలిని పాండేని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. బాలీవుడ్ లో దర్శక నిర్మాతగా అనురాగ్ కశ్యప్ కి మంచి పేరుంది. ఆయన తీస్తున్న సినిమాలో ఛాన్స్ దొరకడం అంటేనే సగం సక్సెస్ కొట్టినట్టే. దీంతో ఈ సినిమాతో అయినా షాలినీ పాండే దశ తిరిగితుందనే భావనలో ఉందట. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

More Related Stories