English   

అల్లు అర్జున్ తో ఛాన్స్ వచ్చినా వదులుకుందట !

Priya Prakash Varrier reject movie chance with allu arjun
2019-01-22 15:47:43

అప్పుడే సినీరంగ ప్రవేశం చేస్తున్న ఒక హీరోయిన్ కి స్టార్ హీరో తో నటించే ఛాన్స్ వస్తే ఆ హీరోయిన్ వదులుకుంటుందా ? అంటే వదులుకోదనే అనుకోవాలి. కానీ ప్రియా ప్రకాష్ వారియర్ తన మొదటి సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్ లో స్టార్ హీరో అయినా అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం వచ్చినా వదులు కొందట. ఓకే ఒక్కసారి కన్ను గీటింది. ఆ దెబ్బకి  ప్రపంచం మొత్తం ఆమెకు ఫిదా అయిపోయింది. ఏ సినిమాలోనిదీ వీడియో అనేది కూడా తెలియకుండా తమకు నచ్చిన పెట్టేసుకుని వాట్సాప్‌, ట్వట్టిర్‌, ఫేస్‌బుక్‌ తదితర సోషల్ మీడియాలో తెగ షేర్లు చేసుకున్నారు.

‘ఒరు అడార్‌ లవ్‌’లోని మాణిక్య మలరాయ పూవై పాటలో చిన్న క్లిప్‌ తో వరల్డ్  ఫేమస్‌ అయిన ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కి ఆ సినిమా విడుదలకు ముందే ఇతర భాషల్లో నటించే అవకాశాలు వెల్లవెత్తాయి. పలువురు తెలుగు హీరోలు, దర్శక నిర్మాతలు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌తో సినిమా చేయాలని ప్రయత్నించారనీ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఒకానొక సమయంలో అల్లు అర్జున్‌ సరసన ఆమె నటిస్తుందని ప్రచారం జరిగింది. దీని మీద క్లారిటీ ఇచ్చేసింది ఈ త్రిసూర్ సుందరి. ఒరు ఆదార్ లవ్‌ తెలుగు అనువాదం ‘లవర్స్‌ డే’ ప్రచారం కోసం ఈ రోజు హైదరాబాద్‌ వచ్చిన ప్రియా ప్రకాశ్‌ వారియర్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం వచ్చినా వదులు కున్నారట నిజమేనా అంటే అవునని చెప్పింది. అల్లు అర్జున్‌ సరసన నటించే అవకాశం వచ్చింది కానీ అప్పటికి ‘ఒరు ఆదార్ లవ్‌’ చిత్రీకరణ పూర్తి కాలేదనీ దాంతో ఆ సినిమా చేయలేకపోయానని చెప్పుకొచ్చింది. అంతేకాక అప్పట్లో తన కొడుకుతో కలిసి అల్లు అర్జున్ ప్రియా ప్రకాష్ ని ఇమిటేట్ చేస్తూ కన్నుకొడుతూ కొన్ని వీడియోలు చేసి అప్లోడ్ చేశారు. దీని మీద కూడా స్పందించిన ప్రియా ఆయన తన గురించి చాలా పోస్టులు పెట్టారని సంతోషం వ్యక్తం చేసింది.

More Related Stories