English   

విజయ్ దేవరకొండకి అభిమాని మాష్టర్ సర్ప్రైజ్ !

vijay devarakonda childhood video goes viral
2019-01-22 23:18:03

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయి చాలా మంది అమ్మాయిల సెల్ ఫోన్స్ లో వాల్ పేపర్ గా మారిన విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు నిరాశ పరచినా ఆయన మాత్రం ఫాం కోల్పోకుండా గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో స్టార్ హోదాని నిలబెట్టుకున్నాడు. అయితే ఈయన మొదటి సినిమా ఏది అని అడిగితే గూగుక్ చేయకుండా కరెక్ట్ చెప్పడం అసాధ్యమే ఎందుకంటే ఈయన లైఫ్ ఈజ్ బ్యూతిఫుల్ సినిమాలో ఒక పాత్ర పోషించిన సంగతి జనానికి గుర్తుంది కానీ రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా ఆయన మొదటి సినిమా అనేది చాలా మందికి తెలియదు. అయితే ఇప్పటి వరకు ఆయన ఈ సినిమాతోనే తెరంగ్రేటం చేశాడని అందరూ అనుకుంటుండగా ఆయన బాల నటుడు అనే సంగతి తెలిసింది. అయితే అయన చిన్నప్పుడు నటించింది సినిమాలో కాదండోయ్ ఒక సీరియల్ లో తాజాగా విజయ్ చిన్నప్పటి వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో 1999 సమయంలోది, అప్పట్లో షావుకారు జానకి మరో కొందరు పిల్లలతో కలిసి విజయ్, ఓ సాయి బాబా టీవీ సీరియల్ లో నటించాడు. దీన్ని సంపాదించిన ఓ అభిమాని, విజయ్‌ దేవరకొండను ట్యాగ్ చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీన్ని చూసిన విజయ్, వీడియోను పోస్టు చేసినందుకు ముచ్చట పడుతున్నాడు. గుండ్రని ముఖంతో అప్పట్లో దేవరకొండ బంగారు కొండలా ఉన్నాడు. ఆ ట్వీట్ మీరు కూడా చూడండి.

More Related Stories