English   

నాగ‌బాబు ఈ సారి లోకేష్ ను టార్గెట్ చేసాడుగా..

Naga Babu Appreciates Nara Lokesh
2019-01-23 01:47:26

పది రోజుల గ్యాప్ తీసుకుని మళ్ళీ రెచ్చిపోయాడు బాబు.. బాబు అంటే చంద్రబాబు కాదు.. నాగబాబు. పడగెత్తిన పాములా మళ్లీ బుస్ అన్నాడు ఈ మెగా బ్రదర్. మధ్యలో సంక్రాంతి సెలవులు తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ పది రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ప్రత్యక్షమయ్యాడు నాగబాబు. వచ్చీ రాగానే తెలుగుదేశం పార్టీపై విమర్శల వర్షం కురిపించాడు. ఈసారి ముఖ్యంగా చిన్న బాబు లోకేష్ ను టార్గెట్ చేశాడు నాగబాబు. ఎందుకో తెలియదు కానీ ఉన్నట్టుండి టిడిపిపై విరుచుకు పడ్డాడు మెగా సోదరుడు. అప్పుడు ఎలాగైతే బాలకృష్ణ అన్న మాటలను అన్ని ఒకచోట చేర్చి విమర్శలు చేశాడో.. ఇప్పుడు కూడా అదే చేశాడు. అప్పుడెప్పుడో లోకేష్ చేసిన కామెంట్ తీసుకుని దానిపై విశ్లేషణ ఇచ్చాడు నాగబాబు. రెండేళ్ల కింద నారా లోకేష్ తెలుగుదేశం పార్టీపై నోరు జారాడు.
మత పిచ్చి, కుల పిచ్చి, బంధుప్రీతి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం ఒక్కటే అంటూ నోరు జారాడు నారా లోకేష్. ఈ వాక్యాన్ని పట్టుకుని ఇప్పుడు వ్యంగ్యంగా కామెంట్ చేశాడు నాగబాబు. భారతదేశంలో నారా లోకేష్ కంటే గొప్ప రాజకీయ నాయకుడు లేడు సెటైర్లు వేశాడు. వాళ్ల పార్టీ విధి విధానాల గురించి వాళ్ళ‌కు తెలిసినంతగా ఇంకెవరికి తెలుస్తాయంటూ సెటైర్ వేస్తూనే.. నిజాలు ఒప్పుకున్నందుకు లోకేష్ బాబుపై ప్ర‌శంస‌ల వర్షం కురిపించాడు నాగబాబు. ఇకపై చాలా విషయాల గురించి యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడతాను అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు నాగబాబు. మొత్తానికి ఆయన వ్యాఖ్యలతో మరోసారి తెలుగుదేశం, జనసేన మధ్య దుమారం రేగింది. మ‌రి ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో చూడాలి.

More Related Stories