English   

యాత్ర సినిమా సెన్సార్ టాక్ !

Yatra gets censor clearance with no cuts ,
2019-01-23 09:48:47

టాలీవుడ్ లో నడుస్తున్న బయోపిక్ ల ట్రెండ్ లో తర్వాతి వరుసలో ఉన్నది దివంగత ముఖ్యమంత్రి వై.య‌స్‌. 2004 ఎన్నికల నేపధ్యంలో చేసిన పాద‌యాత్ర బేస్ చేసుకుని తీసుకొని తెరకెక్కించిన యాత్ర‌. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన ద‌ర్శకుడు మ‌హి వి రాఘ‌వ్ దర్శకత్వంలో మలయాళ సూప‌ర్‌ స్టార్ మమ్ముట్టి, వై‌ఎస్‌ఆర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ వివరాలను యూనిట్ ప్రకటించింది. సెన్సార్ నుంచి ఒక్క కట్ కూడా లేకుండా, క్లీన్ ‘యు’ సర్టిఫికెట్‌ను ‘యాత్ర’ చిత్రం సొంతం చేసుకుందని, అలాగే సెన్సార్ సభ్యులు చిత్రంపై ప్రసంశల వర్షం కురిపించినట్లుగా నిర్మాతలు ప్రకటించారు. అయితే సెన్సార్ విషయంలో ఈ చిత్రానికి ఇబ్బందులు తప్పవని భావించిన వారందరికీ షాక్ ఇచ్చేలా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తవడం విశేషం. టైటిల్ కార్డ్ నుండి ఎండ్ కార్డ్ వరకు సినిమా నిడివి రెండు గంటల ఆరు నిమిషాలు ఉందట. అలాగే సెన్సార్ సభ్యుల స్పంధన బాగుందని ప్రతి సీన్ కనెక్ట్ అయ్యేలా ఉందని అంటున్నారు. క్లైమాక్స్ ప్రతి ఒకరి చేత కంటతడి పుట్టిస్తుందట. బయోపిక్ అయినప్పటికీ ఒక కమర్షియల్ సినిమా స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అలా ఉందని అంటున్నారు.  ఈ సినిమాకు సెన్సార్ అంత సులువుకాదని, ఇబ్బందులు తప్పవని తొలుత భావించారు. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర రెడ్డిగా మమ్ముట్టి, ఆయన తండ్రి రాజా రెడ్డిగా జగపతి బాబు, వైఎస్ ఆత్మ కేవిపిగా రావు రమేష్, సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని, విజయమ్మగా ఆశ్రిత వైఎస్ అనుంగు అనుచరుడు సూరీడుగా పోసాని కృష్ణ మురళి, అప్పటి కాంగ్రెస్ నేత చరితా రెడ్డిగా అనసూయ తదితరులు కీలక పాత్రలు ధరించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఎమేరేకు మెప్పించనుందో మరి !

 

More Related Stories