English   

మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాపై పోస్ట్ చేసిన రామ్ చ‌ర‌ణ్..

Ram Charan post a comment on  Mr Majnu movie
2019-01-23 03:11:30

అఖిల్ సినిమా గురించి రామ్ చ‌ర‌ణ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈయన నటించిన మిస్టర్ మజ్ను సినిమా ట్రైలర్ ఈ మధ్య విడుదలైంది. ఇది చూసిన వాళ్లంతా పదేళ్ల కింద రామ్ చ‌ర‌ణ్ నటించిన ఆరెంజ్ సినిమా గుర్తుకు వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇదే సినిమా ట్రైలర్ చూసి రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది అని ప్రశంసించాడు మెగా వార‌సుడు. ఇది చూస్తుంటే ఒకప్పుడు ఈయ‌న నటించిన సినిమా కచ్చితంగా ఈ హీరో గుర్తు వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఆరెంజ్ సినిమాలో కూడా కొంతకాలం ప్రేమ అంటూ తిరుగుతుంటాడు రామ్ చరణ్. ఇక్కడ అఖిల్ చేస్తున్నది కూడా ఇదే.
కథని ఇప్పటి ప్రేక్షకులకు అర్థమయ్యేలా మార్చి ఆరెంజ్ సినిమానే మళ్లీ తీశాడు వెంకీ అట్లూరి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని ట్రైలర్ మాత్రం అచ్చంగా ఆరంజ్ సినిమాను తలపిస్తుంది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఈ సినిమా ట్రైలర్ చూసి.. అద్భుతంగా ఉంది.. ఆకట్టుకుంటుంది.. ఈ సినిమా కోసం వేచి చూస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసి ఆనందంగా ఫీల్ అయ్యాడు అఖిల్. ఈ ఇద్దరు నిజంగానే అన్నదమ్ముల్లా కలిసి పోయారు. దాంతో ఆ సినిమా విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ రామ్ చరణ్ ఆశీస్సులు తెలియ‌జేసాడు. మ‌రి అక్కినేని వార‌సుడికి మెగా వార‌సుడు అందించే ఆశీస్సులు ఎంత‌వ‌ర‌కు ప‌నిచేస్తాయో చూడాలి. సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

More Related Stories